ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజధానిలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్రంపై విరుచుకుపడ్డారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలంలో ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందన్నారు. రాజధానిలో మహిళలపై జరుగుతున్న గ్యాంగ్ వార్, దోపిడీ, నేర ఘటనలు హృదయాన్ని కలచివేస్తున్నాయని ఆవేదన చెందారు.
READ MORE: CM Revanth Reddy: కుల సర్వేలో కుటుంబ వివరాలు నమోదు చేసుకున్న సీఎం..
ఢిల్లీ అత్యంత భద్రత లేని రాజధానిగా ప్రజలు పిలుస్తున్నారని కేజ్రీవాల్ అన్నారు. ఈరోజు ఢిల్లీ ప్రజలు భయాందోళనలో ఉన్నారన్నారు. “10 సంవత్సరాల క్రితం.. ప్రజలు నాకు విద్యుత్, నీరు, ఆరోగ్యం, విద్య వంటి సమస్యలు తీర్చాలని నన్ను గెలిపించారు. మేము బాగా పనిచేసి ఆయా సమస్యలను పరిష్కరించాం. కానీ ఢిల్లీలో శాంతిభద్రతలకు బాధ్యత వహించే వారు దానిని నిర్వహించడంలో విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ నేరాల రాజధానిగా మారింది. 2022లో 522 హత్యలు జరిగాయి. మహిళలు, వ్యాపారులు భయంతో బతుకుతున్నారు. బాధితుల్లో ఒకరైన రోషన్‌లాల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను నిన్న నాంగ్లోయ్‌కు వెళ్లాను. అక్కడున్న బీజేపీ నాయకులు నన్ను అక్కడికి వెళ్లనివ్వలేదు. బీజేపీ వాళ్లు ఏం దాచాలనుకుంటున్నారో తెలియడం లేదు. శాంతిభద్రతలు బాగానే ఉంటే నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు కదా? అని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.
READ MORE:Maharashtra Cabinet: కుదిరిన మహారాష్ట్ర కేబినెట్.. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులంటే..?
ఇదిలా ఉండగా.. తాజాగా దేశ రాజధానిలో పేలుడు కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు శబ్ధం స్థానికులకు వినిపించింది. పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక దళం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పేలుడుకు కారణమేమిటనే విషయమై ఆరా తీస్తున్నారు. ఆస్తి, ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి సమాచారం లేదు. ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకారం.. గురువారం ఉదయం 11:58 గంటలకు పేలుడు గురించి సమాచారం అందింది. ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు పంపించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఉన్న బన్సీ స్వీట్స్ ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. అంతకుముందు అక్టోబర్ 20న కూడా ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది.