Site icon NTV Telugu

Delhi Minister Atishi: అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని రేసులో లేరు..

Atishi

Atishi

Delhi Minister Atishi: అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని పదవి రేసులో లేరని ఢిల్లీ మంత్రి అతిషి బుధవారం అన్నారు. కేజ్రీవాల్ దేశానికి ఆదర్శప్రాయమైన ప్రధాని కాగలరని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ చేసిన వ్యాఖ్యలపై అతిషి స్పందిస్తూ .. ఇది ప్రధాన ప్రతినిధి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని.. కానీ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని రేసులో లేరన్నారు. ఇండియా ప్రతిపక్ష కూటమిలో ఆప్‌ ఒక భాగం ఎందుకంటే భారతదేశం నేడు రక్షించబడాలని ఢిల్లీ మంత్రి అతిషి పేర్కొన్నారు. దేశం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్సి అవసరం ఉందని.. అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి పదవికి అభ్యర్థి కాదని అధికారికంగా చెబుతున్నానని ఆమె తెలిపారు.

Also Read: Griha Lakshmi Yojana: మహిళలకు కర్ణాటక సర్కారు రక్షాబంధన్ కానుక

దేశ రాజధానిలో ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్‌నే ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలబెట్టాలని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్‌ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు ఈ కూటమికి లీడర్ అయ్యే లక్షణాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడతారని తెలిపిన ఆమె .. ఆయన అమలు చేస్తున్న విధానాల వల్ల ఢిల్లీలో ద్రవ్యోల్బణం తక్కువగా ఉందన్నారు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను వారి కోసమే అరవింద్ కేజ్రీవాల్ ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆయనే కూటమికి సరైన నాయకుడని ప్రియాంక అభిప్రాయపడ్డారు. అయితే ఇండియా కూటమి నేతను నిర్ణయించేది తాను కాదన్నారు ఆ మహిళా నేత.

Also Read: Raksha Bandhan: సోదరుడికి నిజమైన రక్షాబంధన్‌ కానుక.. ప్రాణాన్ని కాపాడేందుకు కిడ్నీ!

2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు తమ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ప్రధాని అభ్యర్థిగా చూడాలని ప్రతి ఆప్ సభ్యుడు కోరుకుంటున్నారని గోపాల్ రాయ్ అంతకుముందు చెప్పారు. అయితే, ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రతిపక్ష కూటమి-ఇండియా (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) నిర్ణయిస్తుందని ఆప్ నాయకుడు తెలిపారు.భారత కూటమి సభ్యులు ఆగస్టు 30, 31 తేదీల్లో ముంబైలో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి అరవింద్ కేజ్రీవాల్ హాజరుకానున్నారు. పాట్నాలో కూటమి తొలి సమావేశాన్ని తప్పించిన తర్వాత ఆప్ పాల్గొననున్న రెండో సమావేశం ఇది.

కొత్తగా ఏర్పాటు చేసిన ప్రతిపక్ష కూటమి మూడో సమావేశంలో మొత్తం 26 నుంచి 27 పార్టీలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశంలో రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది అత్యంత ముఖ్యమైన సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి వ్యూహాలపై చర్చలు జరుగుతాయి. రెండు రోజుల పాటు జరిగే సమావేశంలో విపక్షాల కూటమిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.కూటమి ప్రారంభ సమావేశాన్ని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జూన్ 23న పాట్నాలో ఏర్పాటు చేశారు. ఈ కూటమి రెండో సమావేశం జూలై 17-18 తేదీలలో కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

Exit mobile version