Site icon NTV Telugu

Sanjay Raut: కేజ్రీవాల్ అంటే ప్రధాని మోడీకి భయం..

Sanjay Raut

Sanjay Raut

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి భయం.. అందుకే ఆయనను అరెస్ట్ చేయించారని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. అయితే, అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ మరింత ప్రమాదకరంగా మారారని ఆయన వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా వచ్చే ఆదివారం (మార్చి 31) ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా ఆప్ బ్లాక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇప్పటికే తెలియజేసింది.. ఈ ర్యాలీలో ఇతర నేతలతో కలిసి నేను కూడా పాల్గొంటానని ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు.

Read Also: Holi In Israel : ఇజ్రాయెల్ వీధుల్లో హోలీ శోభ.. రంగులు పూసుకున్న రెండు వేల మంది

కాగా, అరవింద్ కేజ్రీవాల్‌ ఇప్పుడు జైలు నుంచి పని చేస్తున్నారు.. కాబట్టి ప్రజలు కూడా ఆయన మాట వింటారు.. ఢిల్లీ సీఎంకు మద్దతుగా నిలబడతారని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో కూడా జైలుకు వెళ్లిన నాయకులు మరింత బలంగా బయటకు వచ్చారు అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులను భయ పెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు ప్రధాని మోడీ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నా కూడా బీజేపీ పట్టించుకోవడం లేదు.. కాబట్టి మార్చి 31వ తేదీన అన్ని భారత మిత్ర పక్షాల కూటమి నేతలు ఏకతాటిపైకి వచ్చి నిలబడి ర్యాలీ చేయనున్నారు అంటూ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

Exit mobile version