NTV Telugu Site icon

Arvind Kejriwal: బీజేపీకి సవాలు విసిరిన అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సవాలు విసిరారు. ముఖ్యంగా ఢిల్లీలోని మురికివాడల విషయంలో అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. మురికివాడలను కూల్చివేసిన వారికి అదే స్థలంలో ఇళ్లు ఇప్పించి, వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటే నేను ఎన్నికల్లో పోటీ చేయనని ఆయన అన్నారు. అలాగే డిసెంబర్ 27న షకూర్ బస్తీ రైల్వే కాలనీ సమీపంలోని మురికివాడల భూ వినియోగాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మార్చారని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలో చాలా మురికివాడలు ఉన్నాయని, పదేళ్లలో బీజేపీ మురికివాడల స్థానంలో 4700 ఇళ్లు మాత్రమే ఇచ్చిందని అరవింద్ తెలిపారు. ఇక జరగబోయే ఎన్నికలు ముగిసిన వెంటనే బీజేపీ అన్ని మురికివాడలను కూల్చివేస్తుందని ధ్వజమెత్తారు.

Also Read: SpaDeX Docking Update: మూడు మీటర్ల దూరంలో స్పేడెక్స్‌ ఉపగ్రహాలు..

మురికివాడల ప్రజలకు బీజేపీ ద్రోహం చేస్తోందని ఈ సందర్బంగా అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. మురికివాడల స్థానంలో ఇళ్లు ఇస్తామని బీజేపీ చెబుతోందని.. కానీ, అందులోని రైల్వే భూమిని సెప్టెంబర్ 30, 2024న టెండర్ చేసిందని చెప్పుకొచ్చారు. 15 రోజుల క్రితం లెఫ్టినెంట్ గవర్నర్ ఈ మురికివాడల భూ వినియోగాన్ని మార్చారని అన్నారు. ఫిబ్రవరి 8వ తేదీన ఎన్నికలు ముగియగానే మురికివాడలను కూల్చివేస్తారని మురికివాడల ప్రజలకే తెలియదన్నారు. మేము ఈ విషయాన్ని బహిర్గతం చేయడానికి మాత్రమే వచ్చామని కేజ్రీవాల్ అన్నారు.

మరోవైపు, మురికివాడల ప్రజలను అమిత్ షా తప్పుదోవ పట్టిస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ‘స్లమ్ ఉన్నచోట ఇళ్లు’ అని బీజేపీ అంటోంది కానీ, మురికివాడలు ఉన్న చోట తమ మిత్రులు, బిల్డర్ల ఇళ్లు ఉంటాయని చెప్పడం లేదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. వాళ్లకు ఒకే ఒక్క స్నేహితుడు ఉన్నాడని ప్రపంచం మొత్తానికి తెలుసని, మురికివాడల నివాసుల భూమిని తమ స్నేహితుడికి ఇవ్వాలనుకుంటున్నాడని ఆయన అన్నారు.

Show comments