Site icon NTV Telugu

Arvind Dharmapuri: రాజా భాయ్ ఒక్క మిస్డ్‌కాల్‌ ఇస్తే చాలు.. ఎంపీ ధర్మపురి ఆసక్తికర వ్యాఖ్యలు!

Arvind Dharmapuri

Arvind Dharmapuri

Arvind Dharmapuri on Raja Singh BJP membership: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ బీజేపీ పార్టీ రాజీనామాపై ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజా భాయ్ పార్టీ సభ్యత్వం కోసం ఒక్క మిస్డ్‌కాల్‌ ఇస్తే చాలన్నారు. రాజా బాయ్ సస్పెండ్ కాలేదని, రిజైన్ చేశారని తెలిపారు. కొన్ని విషయాల్లో మనస్థాపం చెంది రాజాసింగ్‌ రిజైన్ చేశారని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని అధిష్టానంకు సూచించారు. ప్రతిఒక్కరికి పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని, ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలని ఎంపీ ధర్మపురి చెప్పుకొచ్చారు.

పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ఈరోజు ఎంపీ ధర్మపురి అరవింద్‌ బీజేపీ పార్టీకి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడారు. ‘రాజాసింగ్ ఎక్కడున్నా మేము గౌరవిస్తాం. ఆయన ఐడియాలాజికల్ మ్యాప్. రాజా బాయ్ సస్పెండ్ కాలేదు, రిజైన్ చేశారు. రాజాసింగ్ పార్టీ సభ్యత్వం కోసం ఒక్క మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్‌షిప్‌ తీసుకొచ్చు. కొన్ని విషయాల్లో మనస్థాపం చెంది రిజైన్ చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలి. పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలి, ఫలితం చూపించకపోతే పక్కకు పెట్టాలి. ఏ పార్టీకైనా కార్యకర్తలు కీలకం. కార్యకర్తలు, నాయకులు అయ్యే సమయం ఇది. ఇందూర్ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మేం గెలుస్తున్నాం. తెలంగాణలో వచ్చేవి కార్యకర్తల కోసం జరిగే ఎన్నికలు. ప్రతి నాయకులు ఈ విషయాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి. తమ కార్యకర్తలను నాయకులుగా చేయాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలిపించుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలి’ అని ఎంపీ ధర్మపురి అన్నారు.

Also Read: Variety Thief: జగిత్యాలలో వెరైటీ దొంగ.. అతడి టార్గెట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

‘కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నారు. కొండా మురళి, కొండా సురేఖలు ఏం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కవిత, కేటీఆర్ ఏం చేస్తున్నారు. పార్టీ అన్నాక కొన్ని నడుస్తూ ఉంటాయి. బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈటల, బండి సంజయ్ విషయంలో మాట్లాడాలి. అవసరమైతే అధిష్టానం పెద్దలు మాట్లాడాలి. ఈటల, బండి సంజయ్ విషయంలో సెంట్రల్ పార్టీ నోడల్ ఎంక్వయిరీ కమిషన్ వేసుకోవాలి’ అని ఎంపీ ధర్మపురి అరవింద్‌ పేర్కొన్నారు.

Exit mobile version