Khammam BRS Meeting: 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్.. కనీవినీ ఎరగని స్థాయిలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam BRS Meeting: ఖమ్మంలో ఈ నెల 18న కనీవినీ ఎరగని స్థాయిలో బహిరంగ సభ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దేశం మెచ్చేలా సభకు సన్నాహాలు చేస్తోంది. సభకు రెండు రోజుల ముందే ఖమ్మం నగరం భారీ కటౌట్లు, హోర్డింగ్‌లతో గులాబిమయమైంది. ఈ సభకు సుమారు 5 లక్షల మంది జనసమీకరణ చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. ఈ బహిరంగ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరవుతారని ముందునుంచి చెప్పుకొస్తున్నారు. అయితే.. తెలంగాణ సరిహద్దు జిల్లా కావడంతో.. 3 రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఈ సభలో పాల్గొంటారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. దాదాపు ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన జరగనున్న ఈ సభతో దేశ రాజకీయాలు మలుపు తిరుగుతాయని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీగా అవవతరించిన తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో ఏర్పాట్లు భారీగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఖమ్మం సభ బాధ్యతలను హరీష్‌రావుకు అప్పగించడంతో ఆయన ఖమ్మంలో సమావేశాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ నేతలతో ముచ్చటిస్తున్నారు.
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
- Virat Kohli - Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్‌కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
- IND W vs ENG W: వరల్డ్‌కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
Pawan Kalyan: ఈ నెల 24న కొండగట్టు, ధర్మపురి క్షేత్రాలకు పవన్
దీనిలో భాగంగా సభను ఏకంగా 100 ఎకరాల్లో దేశం నివ్వెరపోయేలా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. కొత్త కలెక్టరేట్ వెనక ఉన్న స్థలంలో బహిరంగ సభ ఏర్పాట్లు రూపుదిద్దుకుంటున్నాయి. ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు హాజరవుతున్న సభకు 5లక్షల మంది జన సమీకరణ చేస్తున్నారు. స్థానిక నేతలు ఇప్పటికే సభ కోసం జనసమీకరణలో నిమగ్నమయ్యారు. జన సమీకరణ కోసం బస్సులు, లారీలు, డీసీఎం సహా పలు వాహనాలను సమకూరుస్తున్నారు. భారీగా తరలివచ్చే కార్యకర్తలు ప్రజానీకం ఎలాంటి ఇబ్బందులు పడకుండా సభాప్రాంగణం ప్రాంతంలో 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీఐపీలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. సభా వేదిక ఎదుట 20 వేల కుర్చీలు వీఐపీల కోసం ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణం లోపల, బయటా సుమారు అతిపెద్ద 50 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చిన వారి కోసం పది లక్షల మంచి నీటి ప్యాకెట్లు, వెయ్యి మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారని నేతలు చెబుతున్నారు. సభ నేపథ్యంలో ఖమ్మం నగరమంతా ఇప్పటికే గులాబీమయమైంది.
తాజావార్తలు
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. బాగా తీసుంటే బాగుండేది కద బుచ్చి..
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
-
Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
-
Virat Kohli – Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్‌కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!