Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arnab Cyclone Relief: అర్నబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తుఫాన్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు రూ.10 వేల ఆర్థిక సాయం, కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు దెబ్బతిన్న వారికి రూ.25 వేల చొప్పున సాయం అందిస్తామని వెల్లడించారు. తుపాను ప్రభావిత కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇక, తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై రేపు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని చంద్రబాబు తెలిపారు. నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందాన్ని పంపించాలని కోరనున్నట్లు వెల్లడించారు. పంటలు, పశువులు, మత్స్య సంపద, ఇతర రంగాల్లో నష్టపోయిన వారందరికీ పారదర్శకంగా పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు.
పంట నష్టానికి ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.75 వేల వరకు సాయం
అర్నబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ పంటలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. పత్తి, గోధుమ, చెరకు పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున అందించనున్నారు. వరి పంటకు ఎకరాకు రూ.20 వేల సాయం ప్రకటించారు. సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు తదితర పంటలకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం అందించనున్నారు. ఇక, అరటి, పసుపు, మామిడి, జీడిమామిడి, కాఫీ, డ్రాగన్ ఫ్రూట్ తదితర పంటలకు ఎకరాకు రూ.35 వేల పరిహారం ప్రకటించారు. కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్ వంటి పంటలకు ఎకరాకు రూ.25 వేల సాయం అందించనున్నారు. తమలపాకు తోటలకు ఎకరాకు రూ.75 వేల పరిహారం ఇవ్వనున్నారు. కొబ్బరి, ఆయిల్ పామ్ చెట్లు దెబ్బతింటే ఒక్కో చెట్టుకు రూ.15 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
Also Read
- AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
- Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. బాధితులకు పరిహారంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Artificial Paneer Ban in AP: ఏపీలో పన్నీరు అమ్మకాలు బంద్..! ఏడాది పాటు నిషేధం
- AP Weather Alert: 9 జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో 3 గంటలు జాగ్రత్త.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి: APSDMA
మత్స్యకారులకు, చేపల చెరువుల యజమానులకు పరిహారం
తుఫాన్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులకు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మోటరైజ్డ్ బోట్లకు రూ.10 వేల నుంచి పరిహారం అందించనున్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఫిషింగ్ బోట్లు, వలలకు నిబంధనల ప్రకారం ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. నాన్ మోటరైజ్డ్ బోట్లు వలలతో సహా పూర్తిగా దెబ్బతింటే రూ.25 వేల పరిహారం అందిస్తారు. ఫిషింగ్ నెట్లకు నష్టం జరిగితే రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు సాయం ప్రకటించారు. చేపల చెరువుల్లో నష్టానికి ఎకరాకు రూ.10 వేల పరిహారం అందించనున్నారు.
పశువులు మృతిచెందితే పరిహారం
మరోవైపు తుఫాన్ కారణంగా పశువులను కోల్పోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. గేదె మృతిచెందితే రూ.40 వేలు, ఆవు మృతిచెందితే రూ.25 వేలు, గొర్రె లేదా మేక మృతిచెందితే రూ.7,500 చొప్పున అందించనున్నారు. పౌల్ట్రీలో మృతిచెందిన ఒక్కో పక్షికి రూ.100 చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. పశువుల షెడ్లు దెబ్బతిన్న వారికి రూ.50 వేల సాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. సెరికల్చర్ షెడ్లు దెబ్బతింటే రూ.25 వేల పరిహారం ప్రకటించింది.
బాధితులకు పారదర్శకంగా సాయం
తుఫాన్ కారణంగా వ్యవసాయం, ఉద్యానవనాలు, పశుసంపద, మత్స్య రంగాల్లో నష్టపోయిన వారిని ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. అర్హులైన బాధితులను గుర్తించి నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని అధికారులకు సూచించారు. తుపాను ప్రభావిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడంతో పాటు, నష్టాల అంచనా, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
-
Telangana Police :15 సెకన్లలో ముఖ గుర్తింపు.. ఫోన్లతోనే వేలిముద్రల సేకరణ!
-
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
-
Cyclone Arnab: అర్నబ్ తుఫానులో 150 కి.మీ వేగంతో గాలులు.. అంతటి శక్తి ఎలా వచ్చింది.?
-
Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!