Army Day 2025: భారత సైన్యం పరాక్రమాన్ని, ధీరత్వాన్ని త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది జనవరి 15న ఇండియన్ ఆర్మీ డేను జరుపుకుంటారు. 1949లో భారత దేశానికి చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ ఫ్రాన్సిస్ బుచర్ నుండి లెఫ్టినెంట్ జనరల్ కోదండెరా కిప్పర్ మదప్ప కరియప్ప భారత సైన్యానికి కమాండర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు అందుకునారు. ఇక అప్పటి మొదలు ప్రతి ఏడాది జనవరి 15ను ‘ఇండియన్ ఆర్మీ డే’ గా భావిస్తూ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇకపోతే, చాలా మంది ప్రసిద్ధ భారత దేశ ఆటగాళ్లకు సైన్యంతో సంబంధాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. వీరిలో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, అభినవ్ బింద్రా, నీరజ్ చోప్రా లాంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. మరి సైన్యంలో ఎలాంటి పోస్ట్ లో ఉన్నారన్న వివరాలు చూస్తే..
Also Read: BCCI: ఇకపై అలా ఆడకపోతే ఆటగాళ్ల పేమెంట్స్‌లో భారీగా కోత పడనుందా?
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, షూటర్ అభినవ్ బింద్రా వారి క్రింద నైపుణ్యాలతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. క్రీడా ప్రపంచంలోని ఈ ఇద్దరు ప్రముఖులు ‘ లెఫ్టినెంట్ కల్నల్ ‘ పదవిని కలిగి ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోనికి 2011 సంవత్సరంలో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ (106 పారా TA బెటాలియన్) పారాచూట్ రెజిమెంట్‌లో గౌరవ ర్యాంక్ ఇచ్చారు. అలాగే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన అభినవ్‌కు 2011 సంవత్సరంలోనే టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ పదవిని ఇచ్చారు. భారత్‌కు తొలి వన్డే ప్రపంచకప్‌ను అందించిన కెప్టెన్, వెటరన్ ఆటగాడు కపిల్ దేవ్ కూడా భారత సైన్యంలో పనిచేశాడు. 2008లో ఇండియన్ టెరిటోరియల్‌లో చేరాడు. సైన్యం అతన్ని ఐకాన్‌గా చేర్చింది.
ఇక ‘గాడ్ ఆఫ్ క్రికెట్’గా పేరొందిన సచిన్ టెండూల్కర్ టీమిండియాకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ కెప్టెన్ గా కూడా పదవిని కలిగి ఉన్నారు. వింగ్ కమాండర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు చేసిన సేవలకు గాను 2010లో భారత సైన్యం ఈ గౌరవాన్ని అందుకుంది. అలాగే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన ప్రముఖ అథ్లెట్ నీరజ్ చోప్రా కూడా సైన్యంలో ఉన్నారు. అతడు పథకాలు సాధించాక ముందే 2016లోనే నీరజ్‌కి ఈ గౌరవం లభించింది. అతను రాజ్‌పుతానా రైఫిల్స్ యూనిట్‌లో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (JCO) నాయబ్ సుబేదార్ పదవిని కలిగి ఉన్నాడు.