Site icon NTV Telugu

MLA Rakesh Reddy: మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ బీజేపీ..

Rakesh Reddy

Rakesh Reddy

జాతీయ పసుపు బోర్డ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ బీజేపీ అని తెలిపారు. సాక్షాత్ ప్రధాని మంత్రి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన, రైతులు అడుగడుగునా మమ్మల్ని అవమానించారన్నారు. పసుపు బోర్డు ఇస్తామని చెప్పి హామీ నెరవేర్చాం. రాబోయేది కాషాయ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.

READ MORE: AAP: ఉచితాలను కొనసాగిస్తూనే, మరో 8-10 హమీలు.. ఢిల్లీలో ‘‘కేజ్రీవాల్ గ్యారెంటీలు’’

అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ఏ దన్‌పాల్ మాట్లాడుతూ.. “నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇచ్చిన హామీ నెరవేర్చి, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తూ, సంక్రాంతి కానుక ఇచ్చారు.” అని తెలిపారు. ఇదిలా ఉండగా.. నిజామాబాద్ లో మరి కాసేపట్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం కానుంది. ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్ లో భారీ ఏర్పాట్లు చేశారు. కేంద్రం మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొననున్నారు. పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు కావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు.

READ MORE: Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ కుమ్ములాట.. ఈసారి సీఎం-డిప్యూటీ సీఎం మధ్య కాదు…

Exit mobile version