NTV Telugu Site icon

Stone Pelting: పోలీసులు-గ్రామస్తులకు మధ్య వాగ్వాదం.. పోలీస్‌స్టేషన్‌పై రాళ్ల దాడి

Jalgav

Jalgav

మహారాష్ట్రలోని జల్‌గావ్‌లో పోలీస్‌స్టేషన్‌పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్విన ఉదంతం వెలుగు చూసింది. ఈ ఘటనలో 8 మంది పోలీసులు గాయపడగా, వారిలో ఆరుగురిని ఆస్పత్రిలో చేరిపించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ సంఘటన జల్గావ్‌లోని జామ్నేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అసలు విషయానికొస్తే.. జూన్ 11వ తేదీన ఈ ప్రాంతంలో 6 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఈ క్రమంలో.. పోలీసులు ఇటీవల నిందితులను అరెస్టు చేశారు. అయితే.. కోపంతో ఉన్న స్థానిక ప్రజలు గురువారం రాత్రి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు.

Read Also: Virat – SKY : ఆ విషయంలో అప్పుడే కోహ్లీ రికార్డును సమం చేసిన సూర్య..

కాగా.. నిందితుడిని తమకు అప్పగించాలని పోలీసులను డిమాండ్ చేశారు. దానికి పోలీసులు నిరాకరించడంతో స్థానిక ప్రజలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా.. ఆగ్రహించిన ప్రజలు పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి సహా మొత్తం 8 మంది పోలీసులు గాయపడ్డారు. మరోవైపు.. కోపంతో ఉన్న ప్రజలు నగరంలోని పలు ప్రాంతాల్లో నిప్పుపెట్టి కొన్ని వాహనాలను దగ్ధం చేశారు.

Isha Koppikar: ఆ హీరో ఒంటరిగా రమ్మన్నాడు.. సంచలన విషయాలు బయట పెట్టిన హీరోయిన్

అయితే.. పరిస్థితి విషమించడంతో జల్గావ్ నగరం నుండి పోలీసు బలగాలను రప్పించారు. ప్రస్తుతం పోలీసులు కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన 8 మంది పోలీసులలో 6 మందిని జల్గావ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో కొందరికి తలకు గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై జలగావ్ డీఎం ఆయుష్ ప్రసాద్ మాట్లాడుతూ.. రాళ్లదాడి ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారని చెప్పారు. వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.