NTV Telugu Site icon

Arekapudi Gandhi: మా ఇంటికి రాకుంటే నీ ఇంటికి నేనే వస్తా.. కౌశిక్ రెడ్డి కి అరికపూడి సవాల్

Arikapudi Gandhi

Arikapudi Gandhi

Arekapudi Gandhi: నువ్వు 11 గంటలకు వస్తా అన్నావు రాకుంటే నీ ఇంటికి వస్తా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి అరికెపూడి గాంధీ ప్రతిసవాల్‌ విసిరారు. దీంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అరికపూడి గాంధీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి వాఖ్యలపై అరికెపూడి గాంధీ సీరియస్ అయ్యారు. నా ఇంటి వద్ద పోలీసు బందోబస్తు అవసరం లేదని, నీ దమ్ము ఏంటో మా దమ్ము ఏంటో తేల్చుకుందాం అంటూ ప్రతి సవాల్ విసిరారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Read also: MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు..

మరోవైపు అరికెపూడి ఇంటికి వెళ్లి కండువా కప్పుకుంటానని పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు పెద్దఎత్తున కౌశికడ్డి ఇంటికి చేరుకున్నారు. ఒకవేళ అలాంటి ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. పీఏసీ కమిటీ అధ్యక్షుడిగా అరికెపూడి గాంధీని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా మా పార్టీ సభ్యుడైనా అరికెపూడి గాంధీ తెలంగాణ భవన్ కు రావాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి బీఆర్‌ఎస్‌లో ఉన్నానని గాంధీ చెప్పాలి.. గురువారం అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్‌ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు.. ప్రతిపక్షంలో ఉన్నా ఇవాళ అరికెపూడి గాంధీ ఇంటికి వెళతానని కౌశిక్ రెడ్డి అన్నారు. అయితే బీఆర్‌ఎస్ పార్టీ కండువా వేసుకోండి అంటూ అరికెపూడి గాంధీ ఘాటుగా స్పందించారు.
MG Windsor EV Price: ‘ఎంజీ విండ్‌సోర్‌’ ఈవీ వచ్చేసింది.. లగ్జరీ, భద్రత మరో లెవల్!

Show comments