ఈ ఏడాది వేసవి ఇబ్బందులకు గురిచేస్తోంది. విపరీతమైన వేడిమి, ఉక్కపోత, వడగాడ్పులతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాతావరణంలో సాధారణంగా శీతల పానియాలకు డిమాండ్ పెరిగింది. వాటిల్లోనూ ఫ్రూట్ జ్యూస్‌లు, షేక్స్, స్మూతీస్‌ని జనాలు ఎక్కువగా తీసుకుంటుంటారు. ఈ వేసవిలో శరీరానికి శక్తినిచ్చేందుకు అందరూ వాటి సైడ్ మొగ్గుచూపుతున్నారు. అలాగే ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ ఇతర పోషకాలు శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Read Also: Fitness Tips: సమ్మెర్ లో వర్కౌట్స్ చేసేవారు తప్పక తెలుసుకోవాలి..!!
అయితే, ఇవి రోజూ తీసుకోవడం వల్ల యాక్టివ్ గా ఉంటారు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా వేసవి అంటే మనకు గుర్తొచ్చే పండు మామిడి.. వీటితో కూడా మిల్క్ షేక్‌లు తయారు చేస్తున్నారు. అలాగే అరటిపండు షేక్ కూడా విరివిగా ప్రజలు వినియోగిస్తున్నారు. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్.. అసలు పాలు అన్ని పండ్లతో కలిపి షేక్స్ చేయొచ్చా? ఇదే విషయంపై ఆయుర్వేద నిపుణులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అన్ని పండ్లతో పాలను మిక్స్ చేస్తే ఆరోగ్యం ఏమో గానీ పలు సమస్యలు వేధిస్తాయంటున్నారు. ఇది స్లో పాయిజన్ గా మారే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
Read Also: Ajit Pawar: మహారాష్ట్రలో కేసీఆర్ విజయం సాధించలేరు.. ఎన్సీపీ నేత కీలక వ్యాఖ్యలు..
ఆయుర్వేదం ప్రకారం అన్ని పండ్లు పాలతో కలపడం మంచిది కాదు.. తీపి, పూర్తిగా పండిన పండ్లు మాత్రమే పాలతో కలిపి షేక్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మామిడి, అరటి రెండూ తియ్యగా ఉంటాయి.. కాబట్టి వీటిని ఎక్కువ మంది బ్రేక్ ఫాస్ట్ లో మామిడి, అరటి మిల్క్ షేక్స్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే నిజానికి ఇవి రెండూ ఆరోగ్యకరమైనవేనా..? ఇంతకు..
Read Also: YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు
అయితే.. పండ్ల ప్రకారం చూసుకుంటే మామిడి, అరటి పండ్లు ఈ రెండూ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కానీ పాలతో కలిపి తీసుకునేటప్పుడు మామిడి మాత్రమే మంచిదని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. అరటి పండు తీపిగా ఉండవచ్చు కానీ జీర్ణక్రియ తర్వాత అది పుల్లగా మారిపోతుంది. ఇది పాలతో మిక్స్ చేయడానికి పనికిరాదు.. అందుకే రెండింటినీ కలపకూడదని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. దీన్ని పరిమితంగా తీసుకుంటే ఫర్వాలేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.