సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అనగానే అంచనాలు ఆకాశన్ని తాకాయి. ఎన్నో ఏళ్లుగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ కాంబోలో సినిమా వస్తుందండంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఈ సినిమా టైటిల్ ఏంటి మహేశ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడు అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు తెరదించాడు రాజమౌళి. గత రాత్రి జరిగిన GlobeTrotter ఈవెంట్ లో SSMB29 టైటిల్ ను వారణాసి గా ప్రకటిస్తూ మహేశ్ బాబు ఫస్ట్ లుక్ గ్లిమ్స్ ను రిలీజ్ చేసాడు రాజమౌళి.
ఎప్పటి నుండో వినిపిస్తున్న ‘వారణాసి’ టైటిల్ నే అధికారకంగా ప్రకటించారు. నిన్న రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారా అంటే ఫుల్ ఖుషి ఉన్నారు అనే చెప్పాలి. మహేశ్ బాబు లుక్స్, శివుని వాహనంపై త్రిశూలం పట్టుకుని వస్తున్న బాబుని చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ ఫిదా అయ్యారనే చెప్పాలి. అయితే జనరల్ ఆడియెన్స్ నుండి ఈ సినిమా కొంత మిశ్రమ స్పందన రాబట్టింది. టాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో ఇలాంటి సీన్స్ ఉన్నాయని కంపారిజాన్స్ కూడా చేసారు. కానీ వరల్డ్ అఫ్ వారణాసి వీడియో గ్లిమ్స్ తో విమర్శలకు కూడా చెక్ పెట్టాడు జక్కన్న. ఆ గ్లిమ్స్ చూస్తుంటే రాజమౌళి ఈ సారి సంచలనానికి తెరలేపాడని ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమనిపించేలా ఉంది. మొత్తానికి అక్కడక్కడ కాస్త విమర్శలు వచ్చిన వారణాసి తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇచ్చాడు రాజమౌళి.