NTV Telugu Site icon

Government Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గ్రూప్- 1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌.. పోస్టులు ఇవే..

Appsc

Appsc

Government Jobs: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. రాష్ట్రంలో గ్రూప్- 1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి సిద్ధమైంది.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఈ రోజు జారీ చేశారు.. ఏపీపీఎస్సీ ద్వారా 597 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు జీఏడీ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి.. గ్రూప్‌-1లో 89 పోస్ట్‌లు భర్తీ చేయనుండగా.. గ్రూప్‌-2 ద్వారా 508 పోస్టులు భర్తీ చేయబోతున్నారు..

Read Also: Karun Nair: అప్పుడలా.. ఇప్పుడిలా.. మళ్లీ తనను తలుచుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్

గ్రూప్‌-1లో భర్తీ చేయనున్న పోస్టుల విషయానికి వస్తే.. డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీస్ పోస్టులు-05 , బీసీ వెల్ఫేర్‌లో- 01, డైరెక్టర్‌ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్‌ ట్రైనింగ్‌-04, డైరెక్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఆడిట్‌- 02, డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్స్‌-06, డిప్యూటీ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కేటగిరి2లో 25, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌-01, డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌-01, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2లో 01, డిప్యూటీ కలెక్టర్‌-12, డిజిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రర్‌-03, అసిస్టెంట్‌ కమిషనర్‌ (ST)-18, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌-01, డిజిస్ట్రిక్ట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌-03, రీజనల్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ ఆఫీసర్‌-06 ఇలా మొత్తంగా 89 గ్రూప్‌ 1 పోస్టులు భర్తీ చేయనున్నారు.

Read Also: Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కేసులో ట్విస్ట్.. ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పవన్‌ ఖత్రిపై సీబీఐ కేసు

ఇక, గ్రూప్‌-2 పోస్టుల విషయానికి వస్తే సెక్రటేరియట్‌, ఆర్థికశాఖలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌-23, సచివాలయం జనరల్‌ ఆడ్మిషన్స్‌లో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌-161, న్యాయశాఖలో అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌-12, లెజిస్లేటివ్‌ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌-10, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్3-04, డిప్యూటీ తహసీల్దార్‌-114, సబ్‌ రిజిస్ట్రార్‌-16, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌-150, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌-18 ఇలా గ్రూప్‌-2 ద్వారా మొత్తంగా 508 పోస్టులు భర్తీ చేయనున్నారు.