Andhra Pradesh: ఏపీలో మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవి కుమార్‌లు ఉండనున్నారు. ప్రస్తుతమున్న మద్యం పాలసీని కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించనుంది.
Read Also: AP CM Chandrababu: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి
వివిధ రాష్ట్రాల్లో ఉన్న మద్యం పాలసీలను మంత్రి వర్గ ఉపసంఘం అధ్యయనం చేయనుంది. మద్యం దుకాణాలు, బార్లు, బేవరేజెస్ కంపెనీల వంటి వాటిల్లో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించనుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి ఇచ్చిన అధికారుల నివేదికను మంత్రి వర్గం ఉప సంఘం పరిశీలించనుంది. మద్యం పాలసీ రూపకల్పనలో భాగంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకోనుంది.