పోలీస్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్, CAPFలో 3,073 సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రెండు పోస్టులకు ఎంపికైతే నెలకు రూ. 35,400 నుండి రూ. 1,12,400 వరకు వేతనం అందుకోవచ్చు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లోని మొత్తం ఖాళీలలో 10 శాతం మాజీ సైనికులకు రిజర్వ్ చేశారు. ఢిల్లీ పోలీస్‌లో మొత్తం 212 ఖాళీలలో 142 పురుషులకు, 70 మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. 10 శాతం (14) ఖాళీలు డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు (పురుషులు), 8 పురుష ఖాళీలు మాజీ సైనికులకు (ఇతరులు), 6 మాజీ సైనికులకు (వివిధ వర్గాలకు) రిజర్వ్ చేయబడ్డాయి.
Also Read:Trump: లీసా మోనాకోను ఉద్యోగం నుంచి తొలగించండి.. మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ ఆదేశాలు
అభ్యర్థులు ఆగస్టు 2, 2002 కు ముందు, ఆగస్టు 1, 2005 తర్వాత జన్మించి ఉండకూడదు. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది. OBC, మాజీ సైనికులకు 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది. ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారి వయస్సు 30 సంవత్సరాలు (UR/EWS), 33 సంవత్సరాలు (OBC), 35 సంవత్సరాలు (SC/ST) మించకూడదు. సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.
Also Read:AP Legislative Council: మండలిలో సద్దుమణిగిన ప్రోటోకాల్ వివాదం
డ్రైవింగ్ లైసెన్స్ లేని పురుష అభ్యర్థులు ఢిల్లీ పోలీస్‌లో కాకుండా CAPFలో సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులకు మాత్రమే అర్హులు. PET, PMT పరీక్షల రోజున వారు తమ డ్రైవింగ్ లైసెన్స్‌ను చూపించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, శారీరక దారుఢ్య పరీక్ష (PET)/ శారీరక ప్రమాణాల పరీక్ష (PST), వైద్య పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 16 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.