AP Congress: ప్రియాంక గాంధీ సమక్షంలో అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధం చేస్తున్నట్లు ఏపీ కాంగ్రెస్ కమిటీ వెల్లడించింది. ప్రియాంక గాంధీకి ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు లేఖ రాశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను బీజేపీ ప్రభుత్వం విస్మరించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల సమయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
Also Read: Vijaya Sankalpa Sabha: కూకట్‌పల్లిలో విజయ సంకల్ప సభకు అమిత్ షా, పవన్ కళ్యాణ్
రాజధాని లేక ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాల్సి ఉందన్నారు. అమరావతి రాజధాని అంశంపై ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నామని.. ఆ సభకు హాజరయ్యేలా సమయం ఇవ్వాలని కోరుతున్నామని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని గిడుగు రుద్రరాజు కోరారు. ఈ విషయంపై ప్రియాంక గాంధీ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.