Atchannaidu: ఓటర్ లిస్ట్ కన్నా.. వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atchannaidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ కన్నా.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల లిస్టు ఎక్కువగా ఉంది అంటూ ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు.. ప్రభుత్వ వైపల్యాలను, అవినీతిని ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు పెట్టి ఏం సాధించారు, ఇంకా కేసులు పెట్టి ఏం పీకుతారు ? అంటూ ఫైర్ అయ్యారు. పాడి రైతుల ప్రగతికి కృషి చేసే నరేంద్ర.. రైతులపైనే దాడి చేయించారంటే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. సంఘం డెయిరీని అక్రమించుకోవాలని ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. అది ఫలించకపోవడంతోనే దింపుడు కళ్ళం ఆశలా రైతులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు అని మండిపడ్డారు.
Read Also: Mangalavaaram : భారీ మొత్తానికి మంగళవారం మూవీ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ..?
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
చంద్రబాబు కోసం ఆత్మాహుతికి పాల్పడే నాయకులు, కార్యకర్తలు టీడీపీ సొంతం అన్నారు అచ్చెన్నాయుడు.. అలాంటి వారు అక్రమ హత్యాయత్నం కేసులకు భయపడతారా జగన్ రెడ్డి..? అంటూ సీఎంను హెచ్చరించారు. మీకు ఇంకా 5 నెలలే ఉంది ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్పి రాష్ట్రం నుంచి తన్ని తరుముతారు అని వార్నింగ్ ఇచ్చారు అచ్చెన్నాయుడు.. కాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్‌లో టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ వస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులు పెట్టడం.. ఆయన్ను అరెస్ట్‌చేసి రాజమండ్రి జైలులో పెట్టిన తర్వాత.. ఆ విమర్శలు మరింత పెరిగాయి.. అయినా, అధికార పక్షం.. స్కామ్‌లు జరిగాయంటూ పలు కేసులు పెడుతూ వస్తూనే ఉంది.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!