Tammineni Sitaram: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రసంగించారు. పాతపట్నంలో ఈ జనవాహిని చూస్తుంటే సముద్రం పొంగివచ్చిందా అన్న రీతిలో హాజరయ్యారన్నారు. పార్టీ పట్ల, జగన్ పట్ల, మీ నాయకురాలి పట్ల అభిమానం కనపడుతోందన్నారు. ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం బీసీ, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరికీ రాజ్యాంగంలో ఉన్న హక్కు మనం ఇచ్చామని, అని తెలియజెప్పడమేనన్నారు. గతంలో పెత్తాందార్లు మన ఓటుతో అందలం ఎక్కారన్నారు. కానీ నేడు ఈ ప్రభుత్వం అందరికీ హక్కులు, సంపద ఇచ్చామన్నారు. అన్ని రంగాల్లో, స్ఠాయిల్లో మార్పు రావాలని పాదయాత్రలో ఆయన గమనించి నేడు ఆ మార్పు చేశానని ఆయన నాతో అన్నారన్నారు. పేదరికం లేకుండా చూడాలని అన్నారని.. పేదరికం సంక్షేమంకు అడ్డంకి రాకుండా డైరెక్టుగా అందించామన్నారు. జన్మభూమి కమిటీ వల్ల కలెక్టర్లు కూడా ఇబ్బంది పడ్డారన్నారు.
Read Also: MP Margani Bharat: పార్లమెంట్‌లో దాడి.. పూర్తిగా భద్రతా వైఫల్యమే..
కానీ నేడు అధికారులు పూర్తి స్వేచ్ఛగా పేదలకు అన్ని పనులు చేస్తున్నారన్నారు. ఎటువంటి లంచం ఇవ్వకుండా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పనులన్నీ పూర్తి చేస్తున్నారని చెప్పారు. అర్హులైన ప్రతీ వారికి అందిస్తున్నామని.. అందులో తెలుగుదేశం కార్యకర్త ఉన్నా డైరెక్టుగా ఇచ్చామన్నారు. మాకు దమ్ముంది అని సచివాలయం వద్ద బోర్డు పెట్టామని, ఇది పేదలకు ఇచ్చామని, ఈ పని మేము చేశాం అని ఇది తప్పు అని నిరూపించాలన్నారు. ఒక్క 10 పైసలు మా కార్యకర్తలు ఎవరైనా అడిగారా తెలుగుదేశం కార్యకర్తలు చెప్పాలన్నారు. ఈ వేదిక సాక్షిగా చెబుతున్నాం.. ఎక్కడైనా లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు. పిల్లలను చదువు కోసం అమ్మ ఒడి ఇస్తే డబ్బులు ఇస్తే డబ్బులు పంపిణీ అనడం తప్పు అని అన్నారు. గతంలో వచ్చిన సంక్షేమ పథకాల డబ్బులు ఎవరి జేబులోకి వెళ్లాయని ఆయన మండిపడ్డారు. ఆలీబాబా 40 మంది దొంగల్లా తాబేదార్లు అందరూ రాష్ట్రం దోచుకున్నారని మండిపడ్డారు. \
Read Also: Breaking: కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త.. రెగ్యులరైజేషన్ గైడ్‌లైన్స్ విడుదల
పగిలిన పలక, చిరిగిన పుస్తకంతో నాడు పాఠశాలకి వెళ్లేవారు… ఇదా అభివృద్ది అంటూ ప్రశ్నించారు. కానీ నేడు స్కూలుకు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నేడు మంచి పుస్తకాలు, బ్యాగ్, యూనిఫాం, మంచి భోజనం ఏర్పాటు చేశాం… ఇది అభివృద్ది అంటూ ఆయన అన్నారు. చంద్రబాబుకు ఎన్ని పేద కులాలు ఉన్నాయో తెలుసా అంటూ ప్రశ్ని్ంచారు. మా ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న 139 కులాలు గుర్తించామన్నారు. వారికి కార్యాలయం ఇచ్చి వారికి కార్పొరేషన్ ఇచ్చి ఆ కులాల ఇబ్బందులు ప్రభుత్వానికి తెలుపాలని చెప్పి వారిని ఓ తాటిపైకి తీసుకువచ్చామన్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పు చేయడానికి వీలు లేదు.. మనకు ఎంతో చేసిన జగన్‌ను మరచిపోకూడదన్నారు.