Site icon NTV Telugu

AP Speaker Ayyanna Patrudu: స్పీకర్‌ అయ్యన్న ఆసక్తికర వ్యాఖ్యలు.. నా నోటికి ప్లాస్టర్ వేశారు..!

Ayyanna Patrudu

Ayyanna Patrudu

AP Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు.. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడుకు సన్మాన సభ నిర్వహించారు.. ఇక, ఈ కార్యక్రమంలో అయ్యన్న మాట్లాడుతూ.. నా వృద్ధి అంతా నా నియోజకవర్గ ప్రజల భిక్షగా పేర్కొన్నారు.. అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నా నోటికి ప్లాస్టర్ వేశారు.. రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చోబెట్టారని చమత్కరించారు.. కానీ, చంద్రబాబు ఇచ్చింది పదవి కాదు.. భాధ్యతగా అభివర్ణించారు. ఐదేళ్లు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అని పిలుపునిచ్చారు.

Read Also: Rautu Ka Raaz: ZEE5లో ఇంట్రెస్టింగ్ మ‌ర్డ‌ర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘రౌతు కా రాజ్’ స్ట్రీమింగ్

ఇక, ఏ పోలీసులైతే గోడ దూకి ఇబ్బంది పెట్టారో.. వారే ఈ రోజు సెల్యూట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు అయ్యన్నపాత్రుడు.. స్థానిక ఎంపీ రమేష్ సహకారంతో జిల్లాలో రెండు, మూడు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు.. మా మూడు (టీడీపీ-జనసేన-బీజేపీ) పార్టీల నాయకులంతా కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం చాలా వెనుకబడింది.. ఆ లోటును పూడ్చుకుని, మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అసెంబ్లీ సమయంలో తప్పించి, మిగిలిన సమయాల్లో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు. నాతో పాటు నా కుమారులు విజయ్, రాజేష్ లు, పార్టీ నాయకులు మీ సమస్యలు తీర్చేందుకు సిద్ధంగా ఉంటారని పేర్కొన్న ఆయన.. గత ఎన్నికల్లో నాతో పాటు మన నాయకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసు అంటూ గుర్తుచేసుకున్నారు. ఇక, జులై ఒకటి నుంచి పింఛన్ల పంపిణీలో పార్టీ నాయకులు భాగస్వామ్యం వహించాలని సూచించారు.. ఎన్ని ఇబ్బందులున్నా అన్నీ పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు.

Exit mobile version