Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains Alert For AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. ఇది ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం రేపటికి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అనంతరం బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాల వైపు చేరే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముంది.
అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ అల్లూరి, నంద్యాల, కడప జిల్లాల్లో పిడుగులతో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బుధ, గురువారాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని సూచించారు.
Also Read
- Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, స్థానిక అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని కోరింది. ఇక రాయలసీమలోనూ అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడనం కదలిక, బలపడే పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!