Site icon NTV Telugu

Chandrababu Arrested: చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదు.. డీజీ..!

Dg

Dg

టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్‌పై విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈరోజు మధ్యాహ్నం తుది తీర్పును వెల్లడించనుంది. చంద్రబాబు హౌస్ రిమాండ్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆయన తరఫు న్యాయవాదులు కోరారు. అయితే చంద్రబాబుకు హౌస్ రిమాండ్‌ను సీఐడీ తరఫు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరుపక్షాలు నిన్న (సోమవారం) కోర్టులో సుదీర్ఘంగా వాదనలు వినిపించగా.. న్యాయమూర్తి నేడు (మంగళవారం) తీర్పు వెల్లడించనున్నట్టుగా తెలిపారు.

Read Also: Jammu And Kashmir : జారి ట్రక్కుపై పడ్డ బండరాయి.. నలుగురు మృతి

అయితే ఈ పరిస్థితుల వేళ జైళ్ల శాఖ డీజీ హరీష్ కుమార్ గుప్తా అడ్వొకేట్ జనరల్‌కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. నిన్న (సోమవారం) ఆయన ఈ లేఖ రాశారు. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదని జైళ్ల శాఖ డీజీ అందులో వెల్లడించారు. ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో అన్ని రకాల వసతులతో కూడిన స్పెషల్ వార్డు కేటాయించామన్నారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ బ్లాక్ శానిటైజ్ చేశామని పేర్కొన్నారు. చంద్రబాబు ఉన్న స్నేహ బ్లాక్‌కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్లు చెప్పారు. స్పెషల్ బ్లాక్ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లు ఆ లేఖలో తెలిపారు.

Read Also: Kim Jong Un: రష్యా వెళ్లిన కిమ్.. పుతిన్‌తో ఆయుధ ఒప్పందం..

ఇక, స్నేహ బ్లాక్ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా జైళ్లశాఖ డీజీ వెల్లడించారు. స్పెషల్ వార్డు ముందు ప్రత్యేక వైద్య బృందం 24 గంటలు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశించినట్టే అన్ని వసతులు కల్పించామన్నారు. కేవలం చంద్రబాబు అనుమతిస్తేనే ఎవరికైనా ఎంట్రీ ఇస్తున్నామని డీజీ చెప్పుకొచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అక్కడి భద్రతను 24 గంటలు పర్యవేక్షిస్తున్నారని జైళ్లశాఖ డీజీ హరీష్ గుప్తా అన్నారు.

Exit mobile version