Site icon NTV Telugu

Buddha Venkanna: సీఎం చంద్రబాబుకు అన్ని కులాలు అండగా ఉన్నాయి: బుద్దా వెంకన్న

Buddha Venkanna

Buddha Venkanna

అన్ని కులాలు మద్దతిస్తేనే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించిందని, సీఎం చంద్రబాబు నాయుడుకు అన్ని కులాలు అండగా ఉన్నాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కులం ఆపాదించిన నీచుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్ని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం వస్తే జైలులో వేస్తాం అని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును కోరాం అని బుద్దా వెంకన్న చెప్పారు.

ఈరోజు సీపీ రాజశేఖర్ బాబుకు విజయసాయి రెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ‘సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం వస్తే.. జైలులో వేస్తాం అని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని సీపీని కోరాము. పోలీసులు స్పందించకుంటే, కేసు నమోదు చేయకుంటే కోర్టును ఆశ్రయిస్తాను. అన్ని కులాలు మద్దతిస్తేనే కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించింది. చంద్రబాబుకు అన్ని కులాలు అండగా ఉన్నాయి. విజయసాయి రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారు. వైఎస్ జగన్ స్కాంలో జైలుకు వెళతారని తెలిసి ముందుగానే ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. గతంలో పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని విష ప్రచారం చేశాడు విజయసాయి. వైసీపీ పార్టీ టైటానిక్ షిప్‌లా మునిగిపోయింది. కమ్మ కులానికి చెందిన ఆస్తులు లాక్కుంటే చంద్రబాబు వాళ్లకు అండగా నిలబడకూడదా?’ అని అన్నారు.

Exit mobile version