నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. చిన్న డిపోలు, పబ్‌లు, ఈవెంట్లలో లిక్కర్ సేల్స్ రికార్డు స్థాయికి చేరాయి. చివరి మూడు రోజుల్లో (డిసెంబర్ 29, 30, 31) రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కోట్లు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకల్లో జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30న రెండు రోజుల్లో 11.30 కోట్లు అమ్మకాలు.. డిసెంబర్ 31న ఒక్క రోజులో రూ.13 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.
Also Read: Ponnam Prabhakar: మూసేసే పరిస్థితి నుంచి లాభాల్లోకి ఆర్టీసీ.. 2026లో కొత్త ఆశలు!
విశాఖలో న్యూ ఇయర్ వేడుకలలో మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయికి చేరాయి. ఒక్క రోజులో రూ.9.9 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు జరిగాయి. కొన్ని జిల్లాల్లో న్యూయర్ అమ్మకాలు సగటు రూ.15 నుంచి 25 కోట్ల వరకు ఉంది. మరో కొన్ని జిల్లాల్లో రూ.15 నుంచి 35 కోట్లు వరకు మద్యం విక్రయాలు జరిగాయి. రోజువారీ సేల్స్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు ఇది. చివరి మూడు రోజుల మొత్తం అమ్మకాలు రూ.500 కోట్లు దాటినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో 3 రోజుల్లో దాదాపు రూ.వెయ్యి కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగినట్టు అధికారులు వెల్లడించాయి.