Site icon NTV Telugu

New Ration Cards : ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. రేషన్‌ కార్డులపై కీలక ఆప్డేట్‌

Ration Cards

Ration Cards

New Ration Cards : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం పట్టుదలతో అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా వేగంగా ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశాల్లో ఒకటి కొత్త రేషన్ కార్డుల జారీ. తాజాగా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

Sri Vishnu : #సింగిల్ డే – 2 సాలిడ్ రన్.. మొత్తం ఎంత రాబట్టిందో తెలుసా.?

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. అప్పట్లో దాఖలైన దాదాపు 3.36 లక్షల అప్లికేషన్లు ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక మే 15 నుండి కొత్త రేషన్ కార్డుల కోసం ‘మనమిత్ర’ అనే వాట్సాప్ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయం కొద్ది రోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలకు మరింత సులభతరంగా సేవలు అందించాలన్న దృష్టితో, ఈ డిజిటల్ విధానం ద్వారా అప్లికేషన్ ప్రక్రియను తీసుకురావడం జరిగింది. జూన్ నెలలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసే దిశగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ లబ్ధి సులభంగా చేరే అవకాశం ఉంటుంది.

Pulwama Attack: పుల్వామా ఉగ్రవాద దాడిలో మా ప్రమేయం ఉంది.. అంగీకరించిన పాక్ సైన్యం

Exit mobile version