AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్‌డేట్స్.. పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ లీడ్!

Ap Elections Results

Ap Elections Results

AP Municipal Elections Results 2026 Live Updates: ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌటింగ్ మొదలయింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. బ్యాలెట్‌లలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. రీపోలింగ్‌ సెంటర్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెల్లడికానున్నాయి. 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు కౌంటింగ్ స్టార్టయ్యింది. మధ్యాహ్నానికి కౌంటింగ్ ట్రెండ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. రాత్రికి పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్‌ ప్రక్రియ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

  • 03 Nov 2026 10:00 AM (IST)

    నందికొట్కూరులో పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం!

    నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో టీడీపీ ఆధిక్యంలో ఉంది.
    మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 82
    టీడీపీ - 45
    వైసీపీ - 31
    ఇండిపెండెంట్ - 6

  • 03 Nov 2026 09:57 AM (IST)

    మాచర్లలో పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యం!

    పల్నాడు జిల్లా మాచర్లలో మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో టీడీపీ ఆధిక్యంలో ఉంది.
    మొత్తం ఓట్లు - 68
    చెల్లని ఓట్లు - 2
    తెలుగుదేశం - 59
    గాలి బుడగ - 1
    పండ్ల బుట్ట - 1
    వైసీపీ బలపరిచిన బీరువా గుర్తు - 4
    నోటా - 1

  • 03 Nov 2026 09:55 AM (IST)

    ఉయ్యూరు పోస్టల్ బ్యాలెట్‌లో వైసీపీ ఆధిక్యం!

    ఉయ్యూరు మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్‌లో వైసీపీ ఆధిక్యంలో ఉంది. అలానే పెడన పోస్టల్ బ్యాలెట్‌లో కూడా వైసీపీ లీడ్‌లో ఉంది. యలమంచిలి పోస్టల్ బ్యాలెట్‌లో సమాన ఓట్లు పోలయ్యాయి.

  • 03 Nov 2026 09:46 AM (IST)

    నరసాపురం పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడి!

    పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 18 ఓట్లకు గాను జనసేన అభ్యర్థి కొత్తపల్లి శైలజకు 12 ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్థి కావలి రామ సీతకు 4.. కాంగ్రెస్ అభ్యర్థి సంతోషి కుమారికి 2 ఓట్లు రాగా.. ఒకటి చెల్లని ఓటు ఉంది.

  • 03 Nov 2026 09:41 AM (IST)

    ఇండిపెండెంట్ అభ్యర్థి లీడ్!

    నెల్లిమర్ల నగర పంచాయతీ పోస్టల్ బ్యాలెట్‌లో ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.

  • 03 Nov 2026 09:38 AM (IST)

    టీడీపీ, జనసేన విజయం!

    కళ్యాణదుర్గం మున్సిపాలిటీ 10వ వార్డులో టీడీపీ విజయం సాధించింది. పెద్దాపురం మున్సిపాలిటీ 3వ వార్డులో జనసేన జయకేతనం ఎగురవేసింది.

  • 03 Nov 2026 09:35 AM (IST)

    వైఎస్ జగన్‌పై కేసు నమోదు!

    వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ రోజు ఆర్వో ఆఫీసు ముందు జగన్ ధర్నా చేశారు. పోలింగ్ రోజే పులివెందుల పోలీసులు కేసు పెట్టారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ జగన్‌పై కేసు నమోదయింది. జగన్‌తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి పైనా కేసు నమోదైంది.

  • 03 Nov 2026 09:08 AM (IST)

    పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ లీడ్!

    ఏపీలో పలు మున్సిపాలిటీల్లో పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ఆధిక్యంలో ఉంది. విశాఖలో టీడీపీ మేయర్ అభ్యర్థి ముందంజలో ఉండగా.. అమలాపురం మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్‌లో జనసేన అధిక్యంలో ఉంది.

  • 03 Nov 2026 09:05 AM (IST)

    జగ్గయ్యపేట కౌంటింగ్ కేంద్రం తాళాలు మిస్సింగ్!

    ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కౌంటింగ్ కేంద్రం తాళాలు మిస్ అయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో తాళాలు మిస్సయ్యాయి. తాళాలు కనిపించకపోవడంతో అధికారులు లాక్ ను బద్దలుకొట్టారు.

  • 03 Nov 2026 08:59 AM (IST)

    నిడదవోలులో ఇంకా ప్రారంభం కాని కౌంటింగ్ ప్రక్రియ!

    తూ.గో. జిల్లా నిడదవోలులో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. వర్షం కారణంగా కౌంటింగ్ కేంద్రానికి ఆలస్యంగా సిబ్బంది చేరుకుంటున్నారు. తుఫాన్ ప్రభావంతో నిడదవోలులో ఉదయం నుంచి ఆగకుండా వర్షం కురుస్తోంది.

  • 03 Nov 2026 08:57 AM (IST)

    చిత్తూరు మేయర్ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యం!

    చిత్తూరు మేయర్ ఎన్నికల్లో టీడీపీ ఆధిక్యంలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీడీపీ ఆధిక్యంలో ఉంది.

  • 03 Nov 2026 08:54 AM (IST)

    ప్రారంభంకాని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్!

    గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. సిబ్బంది కౌంటింగ్ హాల్స్ కు పూర్తిగా చేరుకోలేదు. నాలుగు స్ట్రాంగ్ రూంలలో రెండింటిని అధికారులు ఇంకా ఓపెన్ చెయ్యలేదు. దాంతో కౌంటింగ్ ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

  • 03 Nov 2026 08:40 AM (IST)

    కనిపించని స్ట్రాంగ్‌ రూమ్‌ తాళం!

    పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో కౌంటింగ్‌ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. స్ట్రాంగ్‌రూమ్‌ తాళం కనిపించకపోవడంతో.. లెక్కింపు మొదలు కాలేదు.

  • 03 Nov 2026 08:29 AM (IST)

    నందిగామలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు!

    ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రంలో సిబ్బంది ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి నందిగామలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ.. చైర్మన్, వార్డు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది వర్షంలోనే కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను అధికారులు కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. అనంతరం చైర్మన్, వార్డు అభ్యర్థులకు పోలైన బ్యాలెట్ పత్రాలను సిబ్బంది వేరు చేసే ప్రక్రియ చేపట్టారు. ఆ తర్వాత ఆయా బ్యాలెట్ పత్రాల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.

  • 03 Nov 2026 08:27 AM (IST)

    చిలకలూరిపేటలో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం!

    పల్నాడు జిల్లా చిలకలూరిపేట మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై తుఫాన్ ఎఫెక్ట్ చూపింది. చిలకలూరిపేటలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం పడుతోంది. 8 గంటలకు కూడా సిబ్బంది ఇంకా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోలేదు. దాంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

  • 03 Nov 2026 08:25 AM (IST)

    బెజవాడ ఎన్నికల కౌంటింగ్‌పై మురసు తుఫాన్ ప్రభావం!

    బెజవాడ కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్‌పై మురసు తుఫాన్ ప్రభావం చూపింది. బెజవాడలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు పూర్తి స్థాయిలో ఇంకా చేరుకోలేదు. కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. 8 గంటలకు ప్రారంభం కావలసిన కౌంటింగ్.. అరగంట ఆలస్యం అవుతుందని అధికారులు అంటున్నారు.

  • 03 Nov 2026 08:21 AM (IST)

    ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో ఓట్ల లెక్కింపులో మార్పు!

    ప్రకాశం, బాపట్ల జిల్లాలలో అర్బన్ లోకల్ బాడీస్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభ సమయాన్ని ఉదయం 8 గంటల నుంచి ఉదయం 11:30 గంటలకు మార్పు చేసింది ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం. 'మురసు' తుఫాన్ కారణంగా ఈ రెండు జిల్లాల్లో కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కేంద్రాలకు చేరుకోవడం కష్టతరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 10:30 గంటలకు ఎన్నికల సంఘం వాతావరణ పరిస్థితిని మళ్లీ సమీక్షిస్తుంది. వర్షాలు తగ్గకపోతే తదుపరి నిర్ణయం ప్రకటిస్తుంది.

  • 03 Nov 2026 08:19 AM (IST)

    ఆదోనిలో ఎన్నికల కౌంటింగ్ ఆలస్యం!

    కర్నూలు జిల్లా ఆదోనిలో ఎన్నికల కౌంటింగ్ ఆలస్యం కానుంది. టిఫిన్ ఆలస్యం కావడంతో కౌంటింగ్ సిబ్బంది వేచి ఉన్నారు. కౌంటింగ్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్నా.. సిబ్బందికి టిఫిన్ అందలేదు. సమయానికి టిఫిన్ అందకపోవడంతో కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.

  • 03 Nov 2026 08:16 AM (IST)

    రేపల్లెలో ఓట్ల లెక్కింపు ఆలస్యం!

    బాపట్ల జిల్లా రేపల్లెలో ఓట్ల లెక్కింపు ఆలస్యం కానుంది. మురసు తుఫాన్ కారణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మార్పు జరిగింది. ఉదయం 7 గంటలకు తెరవాల్సిన స్ట్రాంగ్ రూమ్‌ను 10 గంటలకు తెరవాలని అధికారులు నిర్ణయించారు. ఉదయం 11 గంటలకు‌ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

  • 03 Nov 2026 08:14 AM (IST)

    కౌంటింగ్ ప్రారంభం!

    ఏపీ కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అయింది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.

  • 03 Nov 2026 08:10 AM (IST)

    పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్‌కు లైన్ క్లియర్!

    పులివెందులలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కౌంటింగ్‌ నిలిపివేయాలంటూ పులివెందుల వైసీపీ ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి వైఎస్‌ ప్రమీల, ఎంపీ అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఎస్‌ఈసీ రీపోలింగ్‌ నిర్వహించిన నాలుగు వార్డుల్లోనే కాకుండా.. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని మిగతా అన్ని వార్డుల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని, అప్పటివరకు అక్కడ కౌంటింగ్‌ నిలిపేయాలని పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. మంగళవారం ఉదయం 7.30 గంటలకు హైకోర్టు తీర్పు వెలువరించింది.