NTV Telugu Site icon

Minister Roja: సినిమాలో హీరో పాలిటిక్స్‌లో జీరో.. పవన్‌పై రోజా కీలక వ్యాఖ్యలు

Rk Roja

Rk Roja

Minister Roja: పవన్ సిగ్గు లేకుండా ఎన్డీయే మీటింగ్‌కు ఎందుకు వెళ్ళాడో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. మోడీకి చంద్రబాబు చేసిన అవమానాలు గుర్తున్నాయని.. అందుకే ఎన్డీయే మీటింగ్‌కి టీడీపీని పిలవలేదని.. కానీ పవన్ సిగ్గులేని వాడంటూ ఆమె వ్యాఖ్యానించారు. తల్లిని అవమానించిన చంద్రబాబును సీఎం చేసే పనిలో పవన్ ఉన్నారని ఆమె అన్నారు. ఇక్కడ దళపతి అని చెబుతున్న పవన్.. ఢిల్లీలో చంద్రబాబు కోసం దళారీ అయ్యాడన్నారు. ఈస్ట్, వెస్ట్‌లో పవన్ ఊగి పోతూ ప్రసంగాలు చేశాడని.. నేను సీఎం పదవికి రెడీగా ఉన్నా అని పవన్ అంటున్నాడని.. ఇదేమన్నా పెళ్లి కొడుకు వేషమా పెళ్లికి రెడీ అని చెప్పటానికి అంటూ ఎద్దేవా చేశారు. సీఎం అవ్వాలంటే ప్రజా సమస్యలు తెలియాలన్నారు.

Also Read: PowerFull Love Story: ప్రేమంటే ఇదేరా.. ప్రియుడ్ని కలిసేందుకు ఊరంతా కరెంట్ కట్ చేసిన ప్రియురాలు

ఇక్కడ సీఎం అవుతా అంటారు.. అక్కడకు వెళ్లి చంద్రబాబును సీఎం చేయటానికి అందరినీ కలుపుకొని వెళ్దాం అంటారని రోజా విమర్శలు గుప్పించారు. సినిమాలో పవన్ హీరో పాలిటిక్స్‌లో జీరో అంటూ విమర్శించారు. పవన్ సినిమాలో, రాజకీయాల్లో ఉండటానికి చిరంజీవి కారణమని రోజా తెలిపారు. పవన్ ఫ్యాన్స్‌ను తిట్టిన బాలకృష్ణ పిలిస్తే ఇంటర్వ్యూలకు వెళ్తాడు పవన్ అంటూ ఆమె పేర్కొన్నారు. పవన్‌కు తల్లి అంటే, అన్న అంటే, ఫ్యాన్స్ అంటే గౌరవం లేదన్నారు. తన తల్లిని అవమానించిన పవన్.. ఆమె కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలన్నారు.

రోజా మాట్లాడుతూ.. “పవన్ గాడిదలు కాయటానికి పార్టీ పెట్టారా ?. పవన్ సినిమాల్లో రైటర్లు చెప్పే డైలాగ్స్ చెబుతారు. పాలిటిక్స్‌లో చంద్రబాబు చెప్పిన డైలాగ్స్ చెబుతారు. నీతి అయోగ్ మీటింగ్‌లో నాదెండ్ల మాట్లాడతారని పవన్ చెప్తారు. ఎన్డీయే మీటింగ్‌లో రాష్ట్రం కోసం ఏం అడుగుతారు అని అడిగితే అనుభవం లేదని పవన్ సమాధానం ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ చెబుతారు అని పవన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. పవన్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇలా మాట్లాడటం సిగ్గు చేటు. సీఎంని అరేయ్ ఒరేయ్ అని పిలుస్తున్నారు. చంద్రబాబుకు చేసే మనసు లేదు, పవన్‌కు విషయం లేదు.” అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు.

 

Show comments