Minister Roja: సినిమాలో హీరో పాలిటిక్స్‌లో జీరో.. పవన్‌పై రోజా కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja: పవన్ సిగ్గు లేకుండా ఎన్డీయే మీటింగ్‌కు ఎందుకు వెళ్ళాడో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. మోడీకి చంద్రబాబు చేసిన అవమానాలు గుర్తున్నాయని.. అందుకే ఎన్డీయే మీటింగ్‌కి టీడీపీని పిలవలేదని.. కానీ పవన్ సిగ్గులేని వాడంటూ ఆమె వ్యాఖ్యానించారు. తల్లిని అవమానించిన చంద్రబాబును సీఎం చేసే పనిలో పవన్ ఉన్నారని ఆమె అన్నారు. ఇక్కడ దళపతి అని చెబుతున్న పవన్.. ఢిల్లీలో చంద్రబాబు కోసం దళారీ అయ్యాడన్నారు. ఈస్ట్, వెస్ట్‌లో పవన్ ఊగి పోతూ ప్రసంగాలు చేశాడని.. నేను సీఎం పదవికి రెడీగా ఉన్నా అని పవన్ అంటున్నాడని.. ఇదేమన్నా పెళ్లి కొడుకు వేషమా పెళ్లికి రెడీ అని చెప్పటానికి అంటూ ఎద్దేవా చేశారు. సీఎం అవ్వాలంటే ప్రజా సమస్యలు తెలియాలన్నారు.
Also Read: PowerFull Love Story: ప్రేమంటే ఇదేరా.. ప్రియుడ్ని కలిసేందుకు ఊరంతా కరెంట్ కట్ చేసిన ప్రియురాలు
Also Read
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
- Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
ఇక్కడ సీఎం అవుతా అంటారు.. అక్కడకు వెళ్లి చంద్రబాబును సీఎం చేయటానికి అందరినీ కలుపుకొని వెళ్దాం అంటారని రోజా విమర్శలు గుప్పించారు. సినిమాలో పవన్ హీరో పాలిటిక్స్‌లో జీరో అంటూ విమర్శించారు. పవన్ సినిమాలో, రాజకీయాల్లో ఉండటానికి చిరంజీవి కారణమని రోజా తెలిపారు. పవన్ ఫ్యాన్స్‌ను తిట్టిన బాలకృష్ణ పిలిస్తే ఇంటర్వ్యూలకు వెళ్తాడు పవన్ అంటూ ఆమె పేర్కొన్నారు. పవన్‌కు తల్లి అంటే, అన్న అంటే, ఫ్యాన్స్ అంటే గౌరవం లేదన్నారు. తన తల్లిని అవమానించిన పవన్.. ఆమె కాళ్లు కడిగి నెత్తిన చల్లుకోవాలన్నారు.
రోజా మాట్లాడుతూ.. “పవన్ గాడిదలు కాయటానికి పార్టీ పెట్టారా ?. పవన్ సినిమాల్లో రైటర్లు చెప్పే డైలాగ్స్ చెబుతారు. పాలిటిక్స్‌లో చంద్రబాబు చెప్పిన డైలాగ్స్ చెబుతారు. నీతి అయోగ్ మీటింగ్‌లో నాదెండ్ల మాట్లాడతారని పవన్ చెప్తారు. ఎన్డీయే మీటింగ్‌లో రాష్ట్రం కోసం ఏం అడుగుతారు అని అడిగితే అనుభవం లేదని పవన్ సమాధానం ఇచ్చారు. నాదెండ్ల మనోహర్ చెబుతారు అని పవన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. పవన్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇలా మాట్లాడటం సిగ్గు చేటు. సీఎంని అరేయ్ ఒరేయ్ అని పిలుస్తున్నారు. చంద్రబాబుకు చేసే మనసు లేదు, పవన్‌కు విషయం లేదు.” అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు.
తాజావార్తలు
-
Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
-
PM Kisan Yojana: రైతులకు అలెర్ట్.. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే మీ ఖాతాలో డబ్బులు పడవు!
-
Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
-
Vaibhav Sooryavanshi: వీలైనంత త్వరగా బుడ్డోడిని టీమిండియా జట్టులోకి తీసుకరండి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు..
-
Donald Trump: “నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి” నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!