NTV Telugu Site icon

Minister Parthasarathy: గత ప్రభుత్వం గృహ నిర్మాణ నిధులను దుర్వినియోగం చేసింది.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Parthasarathy

Parthasarathy

Minister Parthasarathy: గృహనిర్మాణ నిధులను జగన్ ప్రభుత్వం మళ్లించిందని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధసారథి కీలక కామెంట్లు చేశారు. రిషికొండ నిర్మాణానికి గృహ నిర్మాణ నిధులను మళ్లించి ఉండొచ్చని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఖరారు చేసిన గృహ నిర్మాణ లబ్దిదారుల జాబితాను మార్చేదే లేదని ఆయన స్పష్టం చేశారు. పేదల గృహ సముదాయాల్లో మౌళిక వసతుల కల్పనపై డెప్యూటీ సీఎం పవన్ తో సంప్రదింపులు జరుపుతామని మంత్రి వెల్లడించారు.

Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు.. పూలవర్షంతో స్వాగతం పలికిన కార్యకర్తలు

గత ప్రభుత్వం గృహ నిర్మాణ నిధులను దుర్వినియోగం చేసిందని.. కేంద్రం నుంచి వచ్చిన గృహ నిర్మాణ నిధులను దారి మళ్లించిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధసారథి ఆరోపించారు. గృహ నిర్మాణ నిధులను రిషికొండకు మళ్లించొచ్చు.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి ఉండొచ్చు.. వేరే రకంగానూ నిధుల మళ్లింపు జరిపి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. గృహ నిర్మాణం విషయంలో జగన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్మించిన 4.43 లక్షల ఇళ్లల్లో సగం ఇళ్లకు రూ. 938 కోట్లు చెల్లింపులు జరపకుండా ఎగ్గొట్టిందని ఆరోపణలు చేశారు. పాత బిల్లులను కూడా రిలీజ్ చేస్తామని చెప్పిన మాజీ సీఎం.. ఆ బిల్లులను పెండింగులోనే పెట్టారన్నారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఒక్క ఇంటిని కూడా నిర్మించ లేదన్నారు. గృహ నిర్మాణమంతా కేంద్ర నిధులతోనే చేపట్టిందన్నారు. కేంద్రంలో రాష్ట్ర పరపతిని గత ప్రభుత్వం పూర్తిగా తగ్గించేసేలా వ్యవహరించిందని విమర్శలు గుప్పించారు.

Read Also: Chocolate Syrup: చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుక.. ఫిర్యాదుపై స్పందించిన కంపెనీ

గృహ నిర్మాణానికి నిధులివ్వాలంటే ప్రత్యేక ఖాతా తెరిస్తేనే ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు. గత ప్రభుత్వం నిధుల మళ్లింపు చేస్తుందనే అనుమానంతో కేంద్ర ప్రత్యేక ఖాతాలను తెరిపించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకం వల్ల రూ. 27 కోట్ల మేర పీనల్ ఇంట్రెస్ట్ కేంద్రానికి చెల్లించాల్సి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వంలో పేదల గృహ నిర్మాణం కోసం సేకరించిన భూములు నివాస యోగ్యంగా ఉన్నాయా..? లేవా..? అనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. భూసేకరణ చట్టం కింద భూసేకరణ జరిపిందా..? లేదా..? అనేది చూస్తామన్నారు. లబ్దిదారుల జాబితాను మార్చే ఆలోచన లేదని మంత్రి పార్థసారథి వెల్లడించారు. గృహ నిర్మాణ లబ్దిదారులతో గత ప్రభుత్వం అప్పులు చేయించిందని మండిపడ్డారు. కేవలం లక్షకు పైగా ఇళ్లనే జగన్ ప్రభుత్వం లబ్దిదారులకు అందించిందన్నారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న గత ప్రభుత్వం బూటకపు మాటలు చెప్పిందని విమర్శించారు. గృహ నిర్మాణంలో యూనిట్ కాస్టును గత ప్రభుత్వం దారుణంగా తగ్గించేసిందని వ్యాఖ్యానించారు.

Read Also: Fake Gold: తక్కువ ధరకు బంగారం.. రూ.1.1 కోట్లు టోకరా

2014-19 టీడీపీ ప్రభుత్వం యూనిట్ కాస్టు కంటే 2019-2024 మధ్యనున్న వైసీపీ ప్రభుత్వం తగ్గించేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం యూనిట్ కాస్టు తగ్గించడమే కాకుండా.. రాష్ట్ర వాటాను రూ. లక్ష నుంచి రూ. 30 వేలకు కుదించేసిందని తెలిపారు. ఇంకా నిర్మాణం చేపట్టని ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అందరం కృషి చేస్తామన్నారు. పేదల గృహనిర్మాణ కోసం వివిధ శాఖల నుంచి నిధులను సమీకరించి చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు. పేదల గృహ సముదాయాల వద్ద మౌలిక సదుపాయాల కల్పన పంచాయతీ రాజ్ నిధులూ అవసరమవుతాయన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో సంప్రదింపులు జరిపి నిధుల గృహ సముదాయాల్లో మౌళిక వసతుల కల్పనపై ఫోకస్ పెడతామని మంత్రి స్పష్టం చేశారు.