NTV Telugu Site icon

Minister Narayana: విజ‌య‌వాడ‌, విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుల‌కు స‌హ‌కారం అందించండి..

Minister Narayana

Minister Narayana

Minister Narayana Delhi Tour: విజ‌య‌వాడ, విశాఖ‌ప‌ట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుల విష‌యంలో త్వర‌గా నిర్ణయం తీసుకోవాల‌ని కేంద్ర ప‌ట్టణాభివృద్ది శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్టర్ ను కోరారు ఏపీ పుర‌పాల‌క మ‌రియు ప‌ట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌..రెండో రోజు ఢిల్లీ ప‌ర్యట‌న‌లో భాగంగా కేంద్ర ప‌ట్టణాభివృద్ది శాఖ మంత్రి ఖ‌ట్టర్ తో నారాయ‌ణ భేటీ అయ్యారు..ఈ భేటీలో మంత్రి నారాయ‌ణ‌తో పాటు పుర‌పాల‌క, ప‌ట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి అనిల్ కుమార్ సింఘాల్ కూడా పాల్గొన్నారు..2014-2019 మ‌ధ్య టీడీపీ ప్రభుత్వ హ‌యాంలోనే విజ‌య‌వాడ‌,విశాఖ‌ప‌ట్నంలో మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాద‌న‌లు సిద్దం చేసారు…2015 వ సంవ‌త్సరంలోనే డీపీఆర్‌లు కూడా సిద్ధం అయ్యాయి.. ఆయా ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జ‌రిగాయి.. అయితే ఆ త‌ర్వాత వ‌చ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మెట్రో రైల్ ప్రాజెక్ట్ ల‌ను ఏమాత్రం పట్టించుకోలేదు.. తిరిగి కూట‌మి ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మళ్లీ ఈ ప్రాజెక్ట్‌ల‌పై దృష్టి సారించింది..ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ల‌కు సంబంధించి తాజా నివేదిక‌లు సిద్దం చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఢిల్లీలో కేంద్రమంత్రి ఖట్టర్‌తో భేటీ సంద‌ర్భంగా తాజా ప్రతిపాద‌న‌ల‌తో పూర్తి వివ‌రాలు అందించారు మంత్రి నారాయ‌ణ‌…గ‌త టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో ప్ర‌తిపాదించిన రెండు ప్రాజెక్ట్ ల‌పై త్వర‌గా నిర్ణయం తీసుకోవాల‌ని కోరారు..మ‌రోవైపు విజయవాడ మెట్రో ను రాజధాని అమరావతికి అనుసంధానించే ప్రతిపాదనలు కూడా ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు ఖట్టర్ దృష్టికి తీసుకెళ్లారు నారాయణ.

అమృత్ 2 ప‌థ‌కం ప‌నుల కొన‌సాగింపున‌కు స‌హ‌క‌రించండి.. 

మ‌రో వైపు అమృత్ 2 పథకం అమలుపైనా ఇరువురి మ‌ధ్య కీల‌క చ‌ర్చ జ‌రిగింది…అమృత్ ప‌థ‌కం కింద రాష్ట్రంలోని ప‌లు మున్సిపాల్టీల్లో వివిధ అభివృద్ది ప‌నుల‌ను చేప‌ట్టింది రాష్ట్ర ప్రభుత్వం…నాటి టీడీపీ ప్రభుత్వంలో చేప‌ట్టిన ప‌లు అభివృద్ది ప‌నుల‌ను వైసీపీ ప్రభుత్వం కొన‌సాగించ‌లేదు..పైగా అమృత్ ప‌థ‌కం ద్వారా కేంద్రం ఇచ్చే నిధుల‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా నిధులు కూడా విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో ప్రాజెక్ట్ మొత్తం నిలిచిపోయింది..గత ఐదేళ్లుగా రాష్ట్రంలో అమృత్ ప‌థ‌కం అమలుకు నోచుకోలేదని..ఆ పథకాన్ని ఇప్పుడు కొన‌సాగించాల‌ని కోరారు..మంత్రి నారాయ‌ణ ప్రతిపాద‌న‌ల‌కు కేంద్ర మంత్రి ఖ‌ట్టర్ సానుకూలంగా స్పందించారు…