NTV Telugu Site icon

Minister Kandula Durgesh: సినిమా రంగం అభివృద్ధికి కృషి.. ఆంక్షలుండవు.. లబ్ధి చేకూరుస్తాం

Minister Kandula Durgesh

Minister Kandula Durgesh

Minister Kandula Durgesh: సినిమా రంగం అభివృద్ధి కృషి చేస్తాం.. సినిమా రంగంపై ఇక, ఎలాంటి ఆంక్షలుండవు.. సినిమా రంగానికి లబ్ధి చేకూరుస్తాం అని ప్రకటించారు ఏపీ పర్యాటక, సాంస్క్రతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌.. తనకు శాఖలు కేటాయించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడానికి సిద్ధంగా ఉన్నాం.. పరివాహక ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం హబ్ గా పర్యటక అభివృద్ధి చేస్తాం.. పరిపాలన అందించడానికి సిద్ధం.. కానీ, కక్ష సాధింపు చర్యలకు పాల్పడం.. చట్ట ప్రకారం తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Read Also: Kuwait Fire Accident: కొడుకు కువైట్కు వెళ్లడం ఇష్టం లేదు.. మృతుడి తల్లితండ్రుల రోదన

ఇక, రెడ్ బుక్ కచ్చితంగా ఉంటుందని వ్యాఖ్యానించారు మంత్రి కందుల దుర్గేష్‌.. ఉన్నతాధికారులు సైతం అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు.. ఎవరిపైన అయినా చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు.. నిడదవోలుతో పాటు పిఠాపురం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.. నిడదవోలు ప్రజలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు.. మరోవైపు.. అయితే ఎందుకు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుబడింది? అని ప్రశ్నించారు.. కేవలం బటన్ నొక్కుడికే పరిమితం అయ్యారని విమర్శించారు.. విధివిధానాలే మా గెలుపు కారణంగా చెప్పుకొచ్చారు.. ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరం అన్నారు.. ఈవీఎంలపై వ్యాఖ్యలు అంటే ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకపోవడమే అవుతుందన్నారు ఏపీ పర్యాటక, సాంస్క్రతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌..