Botsa Satyanarayana: ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి తెలంగాణ మంత్రి హరీష్‌రావు ఎవరని ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ.. వాళ్ల రాష్ట్రం గురించి వాళ్లు చూసుకుంటే మంచిదన్నారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న వాళ్లు.. జాగ్రత్తగా మాట్లాడాలన్నారు బొత్స. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి ఎవరు ఏం మాట్లాడారో తమకు తెలుసన్నారు. ఆంధ్ర వాళ్లు తెలంగాణలో ఉండాలనుకుంటారో? తెలంగాణ వాళ్లు అమెరికాలో ఉండాలని అనుకుంటున్నారో? అందరికీ తెలుసన్నారు బొత్స. రాజకీయం కోసం హరీష్ రావు మాట్లాడతాడు.. ఎవరో ఏదో మాట్లాడితే మేం సమాధానం చెప్పాలా? అని నిలదీశారు.. బాధ్యత గల వ్యక్తులు బాధ్యత తెలుసుకుని మాట్లాడాలని హితవుపలికారు..
Read Also: Karnataka Elections: బీజేపీ మాస్టర్ ప్లాన్.. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు చెక్ పెట్టేలా స్కెచ్..
మరోవైపు.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంత్రి బొత్స.. ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఏం ఉద్దరించాడు? అని ప్రశ్నించారు.. తాను చేసిన ఒక మంచి కార్యక్రమం చెప్పమనండి అని సవాల్ చేశారు. అమరావతిలో జరిగింది దోపిడినా? అద్భుతమైన కార్యక్రమమా? అని నిలదీశారు.. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు మేలు చేసిన కార్యక్రమం ఒక్కటైనా ఉందా? అని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా? చంద్రబాబు రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తి.. చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.