ఏపీ లిక్కర్ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు నోటీసులు పంపింది. ఆస్తులను ఆటాచ్ చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై అభ్యంతరాలు ఉంటే చెప్పాలని 11 మందికి నోటీసులు ఇచ్చింది. పలువురు డిస్టిలరీ డైరెక్టర్లు, బ్యాంకులు, లిక్కర్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆస్తుల అటాచ్ చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన నోటీసులపై అభ్యంతరం లేదని నోటీసులు అందుకున్న పలువురు తెలిపారు. నేడు కోర్టుకు హాజరైన కేసులో నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం, SNJ సుగర్స్, ఎంపీ డిస్టిలరీస్ ప్రతినిదులు ఉన్నారు.
Also Read: Asia Cup 2025: ఆ ఐదుగురు ప్లేయర్లు దుబాయ్‌కు వెళ్లరు: బీసీసీఐ
నోటిసులు అందుకున్న వారిలో రాజ్ కేసిరెడ్డి, బూనేటి చాణక్య, కాశీచయనుల శ్రీనివాస్, పైలా దిలీప్, వరుణ్ పురుషోత్తం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నల్లనన్ మతప్పన్ ( ఎంపీ డిస్టిలరీ), నల్లనన్ మతప్పన్ ( SNJ సుగర్స్) ఉన్నారు. ఎస్బీఐ చెన్నై, ఐసీఐసీఐ హైదరాబాద్, ట్రెజరీ ఆఫీసర్ విజయవాడకు సైతం నోటిసులు అందాయి. గత కొన్నిరోజులుగా కలకలం రేపుతున్న లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలువురు అధికారులు, రాజకీయ నేతలు, వ్యాపారులు విచారణను ఎదుర్కొంటున్నారు.