AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. 12 ఏళ్ల రికార్డు బ్రేక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Inter Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌తో పాటు సెకండియర్ ఫలితాలు కూడా ప్రకటించారు.. అయితే, గత 12 ఏళ్ల రికార్డును ఈ సారి ఇంటర్ ఫలితాలు బ్రేక్ చేశాయి.. ఇంటర్ ఫలితాలను ఎక్స్ వేదికగా ప్రకటించిన ఏపీ విద్యాశాఖ నారా లోకేష్.. గత రికార్డులు బ్రేక్ అయిన విషయాన్ని కూడా ప్రస్తావించారు..
Read Also: Bellamkonda Sreenivas : బెల్లంకొండ శ్రీనివాస్.. కావ్య పెళ్లి ఫోటోలు..
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
అయితే, ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ resultsbie.ap.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన మిత్ర వాట్సాప్ సేవ ద్వారా 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపి కూడా ఫలితాలు తెలుసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా గణనీయమైన పురోగతి నమోదైంది. మొదటి సంవత్సరంలో 77 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రెండో సంవత్సరంలో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత 12 ఏళ్లలో ఇది అత్యధిక ఫలితాలుగా ప్రభుత్వం వెల్లడించింది. రెండో సంవత్సరంలో నమోదైన ఉత్తీర్ణత శాతం గత 12 ఏళ్లలో రెండో అత్యుత్తమ ఫలితంగా నిలిచింది. ప్రత్యేకంగా ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యాసంస్థల్లో ఈసారి మంచి ఫలితాలు రావడం విశేషం.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 54గా నమోదై గత 12 ఏళ్లలో అత్యుత్తమ స్థాయికి చేరుకుంది. రెండో సంవత్సరంలో 68 శాతం ఉత్తీర్ణతతో గత 12 ఏళ్లలో రెండో అత్యుత్తమ ఫలితాన్ని నమోదు చేసింది. ఈ విజయానికి విద్యార్థుల కృషి, ప్రిన్సిపాళ్ల మార్గదర్శకత్వం, జూనియర్ లెక్చరర్ల శ్రమతో పాటు విద్యా శాఖ సమన్వయ కృషే కారణమని అధికారులు పేర్కొన్నారు. విద్యా ప్రమాణాల పెంపు కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరుత్సాహపడవద్దని సూచించారు మంత్రి నారా లోకేష్… ఈ అపజయాన్ని విజయానికి తొలి మెట్టుగా భావించి మరింత కష్టపడి ముందుకు సాగాలని ప్రోత్సహించారు. విద్యార్థులకు ఈ సమయంలో తల్లిదండ్రులు, కళాశాలలు, సమాజం నైతిక మద్దతుగా నిలవాలని కోరారు. విద్యార్థులందరికీ భవిష్యత్‌లో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నారా లోకేష్..
Results for the Intermediate Public Examinations are now out.
Students can check their results online at https://t.co/UDtk11c781. Also, results can be accessed by sending a "Hi" message to the Mana Mitra WhatsApp number at 9552300009.
Glad to share that this year’s IPE results…
— Lokesh Nara (@naralokesh) April 15, 2026
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!