Home Minister Taneti Vanitha: పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తోన్నవారికి శుభవార్త చెప్పారు హోంమంత్రి తానేటి వనిత.. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించాం.. ఒకరిద్దరు కోర్టుకు వెళ్లటం వల్ల ఆ ప్రకియ ఆలస్యం అవుతుందన్నారు.. అయితే, త్వరలోనే మిగతా ప్రాసెస్ పూర్తి చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు.
Read Also: Vishwak Sen vs Sai Rajesh:నో అంటే నో..అది మగాళ్ళకి కూడా.. బేబీ డైరెక్టర్ కి విశ్వక్ కౌంటర్లు?
ఇక, ఒంగోలులో గిరిజన యువకుడిపై దాడి ఘటనలో పోలీసులు సత్వరమే స్పందించారని తెలిపారు హోంమంత్రి తానేటి వనిత.. గిరిజన యువకుడిపై అలాంటి ఘటన జరగటం దురుదృష్టకరమన్న ఆమె.. యువకుడిపై దాడి చేసిన ఇతర యువకులు గతంలో కలసి పలు దొంగతనాలకు పాల్పడ్డారని.. ఓ మైనర్ బాలికపై అత్యాచార కేసులో జైలుకు కూడా వెళ్లారని వెల్లడించారు.. చోరీ సొమ్ము పంపకాల విషయంలోనే ఈ దాడి జరిగిందని.. దాడి సమయంలో ఏం జరిగిందో కూడా అర్థం కానీ మద్యం మత్తులో ఆ యువకుడు ఉన్నాడని తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురిని ఇవాళ అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు హోంమంత్రి తానేటి వనిత. కాగా, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ గిరిజన యువకుడి పట్ల కొందరు యువకులు పైశాచికత్వగా ప్రవర్తించారు. బూతులు తిడుతూ, నోట్లో మూత్రం పోసి చావబాదారు.. వదిలేయమని బతిమాలినా వినలేదు. అయితే, ఈ ఘటన మొత్తం ఓ మొబైల్‌లో చిత్రీకరించడంతో.. ఆలస్యంగా వెలుగు చూసిన విషయం విదితమే..