NTV Telugu Site icon

Ambati Rambabu: రీపోలింగ్ జరపాలి.. అంబటి, చెవిరెడ్డి పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ

Ap High Court

Ap High Court

Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌కు ముందు నుంచే పల్నాడు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఎన్నికల తర్వాత కూడా రెండు రోజులపాటు టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపించింది. కొందరు నేతలు, కార్యకర్తలకు రిగ్గింగ్‌లకు పాల్పడ్డారని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో రీ పోలింగ్‌ జరపాలని మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని 236, 237, 253, 254 పోలింగ్‌ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు.

Read Also: AP Crime: హైస్కూల్‌లో దారుణం.. తరగతి గదిలో సహచర విద్యార్థినిపై అత్యాచారం

ఈ పిటిషన్‌లో ఈసీ, సీఈవో సహా మరో ఐదుగురిని ప్రతివాదులుగా చేర్చారు. మంత్రి అంబటి రాంబాబు వేసిన ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మరోవైపు మాచర్లలో రీ పోలింగ్ నిర్వహిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి కూడా ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 4 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ చేపట్టాలని పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా ఈసీ, సీఈవోతో పాటు మరో ఏడుగురిని చేర్చారు. ఈ పిటిషన్‌పై కూడా ఇవాళ విచారణ జరపనుంది హైకోర్టు. ఇక రిగ్గింగ్‌ జరిగిన చోట రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి. దీనిపై హైకోర్టులో పిటిషన్‌ వేస్తామన్నారు. అవసరమైన రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేయడంతో అక్కడ రీ పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. తాజాగా దీనిపై ఏపీ సీఈవో ఎంకే మీనా వివరణ ఇవ్వడం జరిగింది. ఈవీఎం ధ్వంసమైనా అందులోని డేటా భద్రంగా ఉందని అన్నారు. మాచర్లలో రీ పోలింగ్ నిర్వహించే అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.