Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లికి హైకోర్టులో ఊరట.. మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపింది. వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని పిన్నెల్లి న్యాయవాది కోరారు. పిన్నెల్లి మీద నమోదైన ఈవీఎం ధ్వంసం కేసుతో లింకై మిగతా మూడు కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. ఘటన జరిగినప్పుడు కూడా తర్వాత మాత్రమే కుట్ర పూరితంగా పిన్నెల్లి మీద కేసులు పెట్టారని పిన్నెల్లి న్యాయవాది వాదనలు వినిపించారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
Read Also: Pawan Kalyan: పవన్ కల్యాణ్ కి మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం..
ఏడేళ్ళ లోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్న కేసుల్లో 41ఏ నోటీసు ఇవ్వచ్ఛని సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. ఎన్నికల సంఘం ఈవీఎం ధ్వంసం కేసులో విచారణ చేయాలని కాకుండా నేరుగా అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వటం చట్ట విరుద్ధం అని కోర్టుకు తెలిపారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ప్రతిష్ఠ మసకబారేలా మాత్రమే తప్పుడు కేసులు పెట్టారన్నారు. హత్యా యత్నం కేసు నమోదులో కూడా పోలీసులు రికార్డులు తారు మారు చేశారని 13న ఘటన జరిగితే 23 కేసు నమోదు చేసి 22ను కోర్టును తప్పు దారి పట్టించారని కోర్టుకు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని వీఆర్ఓ ఫిర్యాదు చేశారని పిన్నెల్లి న్యాయవాది కోర్టుకు తెలిపారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!