Site icon NTV Telugu

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లికి హైకోర్టులో ఊరట.. మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు!

Pinnelli

Pinnelli

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు మధ్యంతర బెయిల్‌పై విచారణ జరిపింది. వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని పిన్నెల్లి న్యాయవాది కోరారు. పిన్నెల్లి మీద నమోదైన ఈవీఎం ధ్వంసం కేసుతో లింకై మిగతా మూడు కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు. ఘటన జరిగినప్పుడు కూడా తర్వాత మాత్రమే కుట్ర పూరితంగా పిన్నెల్లి మీద కేసులు పెట్టారని పిన్నెల్లి న్యాయవాది వాదనలు వినిపించారు.

Read Also: Pawan Kalyan: పవన్ కల్యాణ్ కి మెగా ఫ్యామిలీ ఘన స్వాగతం..

ఏడేళ్ళ లోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్న కేసుల్లో 41ఏ నోటీసు ఇవ్వచ్ఛని సుప్రీం కోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. ఎన్నికల సంఘం ఈవీఎం ధ్వంసం కేసులో విచారణ చేయాలని కాకుండా నేరుగా అరెస్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వటం చట్ట విరుద్ధం అని కోర్టుకు తెలిపారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ప్రతిష్ఠ మసకబారేలా మాత్రమే తప్పుడు కేసులు పెట్టారన్నారు. హత్యా యత్నం కేసు నమోదులో కూడా పోలీసులు రికార్డులు తారు మారు చేశారని 13న ఘటన జరిగితే 23 కేసు నమోదు చేసి 22ను కోర్టును తప్పు దారి పట్టించారని కోర్టుకు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని వీఆర్ఓ ఫిర్యాదు చేశారని పిన్నెల్లి న్యాయవాది కోర్టుకు తెలిపారు.

Exit mobile version