Vidadala Rajini: నా రాజకీయ భవిష్యత్ జగన్ పెట్టిన భిక్షే.. మంత్రి భావోద్వేగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidadala Rajini: రాబోయే ఎన్నికల్లో దిక్కులు పిక్కటిల్లేలా జగన్ గెలుపు ఉండబోతుందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం జగన్ ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. చంద్ర బాబు హయాంలో ఆరోగ్య రంగాన్ని అమ్మకానికి పెట్టాడని.. ఆరోగ్య శ్రీని అనారోగ్య శ్రీగా మార్చేశారని ఆమె ఆరోపించారు. చంద్రబాబు హయాంలో వైద్య రంగానికి ఏం చేశాడో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో ఒక ముఖ్యమంత్రి ఎంత చేయొచ్చో.. సీఎం జగన్ ఆరోగ్య రంగంలో చేసి చూపించారని మంత్రి రజిని పేర్కొన్నారు. దుష్టచతుష్టయం ఎన్ని పన్నాగాలు పన్నినా.. భూమి చీలినా.. నింగి కుంగినా.. అన్యాయానికి ఓటమి తప్పదని, చంద్రబాబు టీడీపీ ఓటమి తప్పదని, జగనన్న గెలుపు తథ్యమని ఏపీ ఆరోగ్య మంత్రి విడదల రజిని అన్నారు.
Read Also: AP CM YS Jagan: ఇంటికే వైద్యం.. ఫ్యామిలీ డాక్టర్ దేశానికే రోల్ మోడల్
Also Read
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
చంద్ర బాబు నలుగురు ఎమ్మెల్యే లను కొనగలడు కానీ, జగనన్న కోసం ప్రాణాలు ఇచ్చే నాలుగు కోట్ల మంది ప్రజలను మాత్రం కొనలేడని మంత్రి అన్నారు. ఒక సాధారణ మహిళనైన తనకు ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం ఇచ్చిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. తన రాజకీయ జీవితం, తన పదవులు, రాజకీయ భవిష్యత్తు మీరు పెట్టిన భిక్షేనంటూ సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ.. భావోద్వేగంతో రజిని కంటతడి పెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య రంగంలో చరిత్ర సృష్టించారని ఈ సందర్భంగా అన్నారు. మళ్ళీ ఇప్పుడు జగన్ ఫ్యామిలీ డాక్టర్ విధానంతో తండ్రికి తగ్గ తనయుడుగా చరిత్ర సృష్టిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత అధికారం లోకి వచ్చిన ఏ నాయకుడు ప్రజా ఆరోగ్యం పై దృష్టి పెట్టలేదన్నారు. మహా నగరాల్లో ధనవంతులకు మాత్రమే ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారని ఆమె స్పష్టం చేశారు. గ్రామాల్లో ఉండే పేదల కోసం ఇక నుంచి ఫ్యామిలీ డాక్టర్ ఉండబోతున్నాడని ఆమె పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పథకం వినూత్నం, విలక్షణం. ఇది జగన్ మానసపుత్రిక అని మంత్రి రజిని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!