NTV Telugu Site icon

AP News: రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు..

Ap Empolyees

Ap Empolyees

రేపు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం చర్చించనుంది. పెండింగ్ సమస్యల పరిష్కారంపై సమ్మె బాట పడతామని ఏపీఎన్జీవోలు హెచ్చరించడంతో ఉద్యోగ సంఘాల నేతలతో సంప్రదింపులు జరపనుంది. కాగా.. ఐఆర్, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాకుండా.. పెండింగ్ డీఏలతో పాటు రిటర్మైంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని పట్టు పడుతున్నాయి.

Read Also: EC: తిరుపతి దొంగ ఓట్ల వ్యవహారంపై ఈసీ చర్యలు..

ఈ సందర్భంగా.. ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రేపు ప్రభుత్వంతో చర్చలు ఉన్నాయని.. అవి సఫలం కాకపోతే ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తామన్నారు. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో 104 ఉద్యోగ సంఘాలతో, కార్యవర్గంతో సుదీర్ఘంగా చర్చలు జరిగాయని తెలిపారు. ఆ చర్చల్లో ఉద్యమకార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈనెల 14న నల్ల బ్యాడ్జిలు ధరించి అన్ని కార్యాలయాల్లో మెమొరాండాలు ఇస్తామని తెలిపారు. 15, 16వ తేదీలలో భోజన విరామ సమయంలో నిరసన చేపట్టబోతున్నామని చెప్పారు. 17న తాలుఖా కేంద్రాలలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహణ..
20న కలెక్టరేట్ల వద్ద ధర్నా, 21నుండి 24 వరకు అన్ని జిల్లాల పర్యటన చేస్తామని.. 27న జరిగే చలో విజయవాడ చేస్తామని తెలిపారు.

Read Also: U 19 World Cup Final: ఇండియా-ఆస్ట్రేలియా ఫైనల్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

అప్పటికి స్పందించకపోతే ఏ నిమిషంలోనైనా మెరుపు సమ్మె చేపడతామని అన్నారు. 12th పీఆర్సీ కమీషన్ ఎక్కడుందో తెలీదు.. పీఆర్సీ పట్ల చిత్తశుద్దిలేదని ఆరోపించారు. రెండు పెండింగ్ డీఏలు ప్రకటించాల్సి ఉందని.. జీపీఎఫ్ బిల్లులు చెల్లింపులు లేవని బండి శ్రీనివాసరావు తెలిపారు. ప్రతినెల 1వ తేదీన వేతనాలు, పెన్షన్లు ఇవ్వాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు.. అనేక పెండింగ్ సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.