Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చడమే సీఎం చంద్రబాబు నాయుడి లక్ష్యమని, అందులో భాగంగా ‘నూతన నేతన్న భరోసా పెన్షన్’ దరఖాస్తు విధానంలో ఒక కీలక నిబంధనను సడలించినట్లు మంత్రి సవిత స్పష్టం చేశారు. ఇకపై పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే చేనేత కార్మికులు తమ బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం మాస్టర్ వీవర్ ధ్రువీకరణ పత్రం, తమ వేతన వివరాలను అందజేస్తే సరిపోతుంది. ఈ నిబంధన సడలింపుతో 50 ఏళ్లు నిండిన నేతన్నలందరికీ సులభంగా పెన్షన్లు అందే మార్గం సుగమమైంది. అందువల్ల అర్హులైన కార్మికులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది.
ఇలా నేతన్నలకు ఊరటనిస్తూనే, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రత, ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్’ పథకం కింద కొత్త దరఖాస్తుల నమోదును వేగవంతం చేసింది. ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల ద్వారా కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా 6,81,501 దరఖాస్తులు నమోదయ్యాయి.
Also Read
- Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
ఇప్పటివరకు నమోదైన దరఖాస్తుల వివరాలను కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా వృద్ధాప్య పింఛన్ కోసం 3,76,019 మంది దరఖాస్తు చేసుకోగా, వితంతు పింఛన్ కోసం 1,65,201 మంది, దివ్యాంగుల పింఛన్ కోసం 1,09,595 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే కల్లుగీత కార్మికుల నుంచి 7,005, మత్స్యకారుల నుంచి 6,268, డప్పు కళాకారుల నుంచి 5,565, సంప్రదాయ చెప్పుల తయారీదారుల నుంచి 4,981, నిబంధనలు సడలించబడిన చేనేత కార్మికుల నుంచి 4,932, ఒంటరి మహిళల నుంచి 1,633, మరియు ట్రాన్స్జెండర్ల నుంచి 342 దరఖాస్తులు వచ్చాయి. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్ నమోదు, ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియకు సెప్టెంబర్ 16 వరకు గడువు నిర్ణయించారు. ఈ దరఖాస్తు గడువును మరింత పెంచే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?