Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
- బ్రిక్స్ సమావేశాలకు ఢిల్లీ సిద్ధం..
- ప్రత్యేక ఆకర్షణగా పుతిన్ కారు ‘‘అరస్ సెనాట్’’..
- బుల్లెట్లు, బాంబుల్ని తట్టుకునేలా నిర్మాణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin Car: భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి న్యూఢిల్లీ సిద్ధమైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ సహా పలు దేశాధినేతలు, దౌత్యవేత్తలు, వీవీఐపీలు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే, పుతిన్ కారు ఇప్పుడు ఢిల్లీ వీధుల్లో తిరుగుతోంది. ‘‘ఆరస్ సెనాల్ లిమోసిన్’’ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పుతిన్ సాధారణంగా విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో ఈ కారును తీసుకెళ్తారు. ఈ కారు ఒక రకంగా నడిచే రక్షణ కోటగా చెప్పవచ్చు.
పుతిన్ కారు ఎంతో ప్రత్యేకం:
ప్రపంచంలో అగ్రదేశాల్లో ఒకటైన రష్యా అధినేత పుతిన్‌కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లే సమయంలో ప్రత్యేక విమానంలో ముందుగానే ఆయన కారును ఆ దేశానికి పంపిస్తారు. పుతిన్ కాన్వాయ్‌లో రెండు డజన్ల కార్లు ఉన్నప్పటికీ, ఆయన తన ప్రధాన కారు ఆరస్ సెనాట్లోనే ప్రయాణిస్తుంటారు. ఇది బుల్లెట్ ప్రూఫ్, పేలుళ్లను కూడా తట్టుకునేలా డిజైన్ చేశారు. గతేడాది చైనాలో జరిగిన ఎస్సీఓ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్రమోడీ, పుతిన్ కలిసి ఇద్దరూ ఈ కారులో ప్రయాణించారు. దీంతో అప్పట్లో ఈ కారు వార్తల్లో నిలిచింది.
Also Read
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
పూర్తిగా రష్యన్ టెక్నాలజీ:
అరస్ సెనాట్‌ను రష్యాకు చెందిన అరస్ మోటార్స్ డెవలప్ చేసింది. ఈ కారు తయారీలో రష్యా ప్రభుత్వ పరిశోధనా సంస్థల భాగస్వామ్యం ఉంది. ఈ కారును కార్టెజ్ ప్రాజెక్టులో భాగంగా రూపొందించారు. రష్యా ప్రభుత్వం కోసం దేశీయంగా లగ్జరీ, ఆర్మర్డ్ వాహనాలను డెవలప్ చేయడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం. అరస్ సెనాట్ డిజైన్‌పై సోవియట్ కాలం నాటి ZIS-110 లిమోసిన్ ప్రభావం ఉంది.
బుల్లెట్లను, పేలుళ్లను తట్టుకునేలా బాడీ:
పుతిన్ ఉపయోగించే అరస్ సెనాట్ కారు బుల్లెట్ల దాడుల్ని కూడా తట్టుకుంటుంది. పేలుళ్ల ప్రభావాన్ని తట్టుకునేలా రూపొందించారు. అత్యంత కీలకమైన భద్రతా పరిస్థితుల్లో కూడా అధ్యక్షుడు తన ప్రయాణాన్ని కొనసాగించేలా దీని నిర్మాణం ఉంటుంది. యాక్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, అధునాతన బ్రేకింగ్ సిస్టమ్స్ వంటి ఆధునిక డ్రైవింగ్, భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
598 హార్స్పవర్.. 880 Nm టార్క్:
అరస్ సెనాట్‌లో 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌ను హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేశారు. ఇది ఏకంగా 598 హార్స్పవర్, 880 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. దీని పొడవు 5,630 మి.మీ., వెడల్పు 2,000 మి.మీ., ఎత్తు 1,700 మి.మీ., వీల్ బేస్ 3,300 మి.మీ ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 9 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
కారు లోపల ఫైవ్ స్టార్ లగ్జరీ ఫీచర్లు:
బయటకు ఎంతో స్ట్రాంగ్‌గా కనిపించే ఈ కారు, లోపల మాత్రం లగ్జరీ ఫీచర్లను కలిగి ఉంటుంది. హై-ఎండ్ లెదర్, వుడ్ ట్రిమ్, ఆధునిక ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థలు వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా వాహనాన్ని రూపొందించారు.
అరస్ సెనాట్ కారును సాధారణ ప్రజల కోసం కూడా ఒక వెర్షన్ ఉంది. అయితే దీని ఉత్పత్తి మాత్రం సాధారణంగా పరిమితంగా ఉంటుంది. ఏడాదికి కేవలం 120 కార్లు మాత్రమే రూపొందిస్తారు. దీని ధర 18 మిలియన్ రూబెల్స్, ఇండియన్ కరెన్సీలో రూ. 2.5 కోట్లగా ఉంటుంది.
తాజావార్తలు
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?