ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, మరణాలు కూడా ఎక్కువగా ఉన్నాయని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్యారోగ్య శాఖ కమిషనర్ నివాస్ దీనిపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో కొవిడ్ మరణాలు సంభవిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. కాకినాడలో 21 ఏళ్ల ప్రసాద్ అనే వ్యక్తికి ర్యాపిడ్ పరీక్షలో పాజిటివ్ వచ్చింది. అయితే వైరల్ న్యూమోనియా వల్ల మరణించాడని కాకినాడ జిజిహెచ్ సూపరింటెండెంట్ నివేదిక ఇచ్చారు. 26 ఏళ్ల సందీప్ అనే వ్యక్తికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో పాజిటివ్ వచ్చిందన్నారు వైద్యారోగ్య శాఖ కమిషనర్ నివాస్.
Read Also: Chada Venkat Reddy : బీజేపీ వల్ల దేశానికి నష్టమని తెలిసి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు..
నెక్రోటైజింగ్ ప్యాంక్రియాలైటిస్ వల్ల మరణించారు.వైజాగ్ లో 21 ఏళ్ల పి.చింటో కూడా వైరల్ న్యూమోనియాతోనే మరణించారు.చింటోకు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగటివ్ అని తేలిందని వివరించారు నివాస్. కరోనా వ్యాప్తి అంత తీవ్రంగా లేదని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read Also:Reels on Instagram: బైక్ పై రీల్స్ చేసిన యువతి.. పోలీసులేం చేశారంటే?