Site icon NTV Telugu

AP Governor: తిరుమలలో నేటి నుంచి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన..

Governor

Governor

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఇవాళ్టి నుంచి రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. దీంతో గవర్నర్ టూర్ కు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. తిరుపతి నగరంలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలెక్టర్ మీటింగ్ నిర్వహించారు. ఇవాళ ఉదయం 10.30గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ చేరుకోనున్నారు. అనంతరం పద్మావతి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుని మధ్యాహ్నం 3 గంటలకు మహిళా వర్సిటీలో నిర్వహించనున్న వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో పాల్గొంటారు.

Read Also: Bigg Boss7 Telugu : రన్నర్ గా అమర్ ఎన్ని లక్షలు తీసుకున్నాడో తెలుసా? ఎక్కువ రెమ్యూనరేషన్ అతనికే..

ఇక, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర తర్వాత గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుమలకు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు. రేపు (మంగళవారం) ఉదయం శ్రీవారిని దర్శించుకుని, సాయంత్రం రేణిగుంట రైల్వే స్టేషన్‌ నుంచి దురంతో ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు ఆయన బయలుదేరుతారు. అయితే, గవర్నర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Exit mobile version