బిగ్ బాస్ 7 సీజన్ తెలుగు నిన్న గ్రాండ్ ఫినాలే జరిగింది.. విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు.. రన్నర్ గా సిరియల్ హీరో అమర్ దీప్ అయ్యారు.. రన్నర్గా నిలిచిన అమర్ కూడా బాగానే సంపాదించారు.. పల్లవి ప్రశాంత్ కు దగ్గరిలో ఉందని తెలుస్తుంది.. నిజానికి అనారోగ్యంతో బాధపడుతున్నా ఏనాడూ బయటకు చెప్పుకోలేదు. హెల్త్ ప్రాబ్లమ్ వల్ల టాస్కులు ఆడలేకపోయినా అది తన వైఫల్యంగానే భావించాడే కానీ అనారోగ్యాన్ని సాకుగా చెప్పలేదు. విజయానికి అడుగు దూరంలో ఆగిపోయిన అమర్ రన్నరప్‌గా నిలిచాడు.. అయితే తగ్గలేదు..
ప్రస్తుతం అతని రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంది.. వారానికి రూ.2.5 లక్షలు ఇచ్చారని టాక్.. ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37,50,000 అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ట్యాక్స్‌లు, జీఎస్టీల రూపంలో దాదాపు సగం ప్రభుత్వమే లాగేసుకుంటుంది.. దాంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు..
ఇకపోతే శివాజీ సీజన్ 7 విజేతగా నిలుస్తాడు అని అందరూ భావించారు. ఫ్యామిలీ వీక్ తర్వాత అంతా రివర్స్ అయింది.. టైటిల్ చేజారిపోయింది. అయినప్పటికీ విన్నర్ రేసులో అమర్, ప్రశాంత్ లకు గట్టి పోటీ ఇచ్చాడు శివాజీ. కనీసం రన్నర్ గా నిలుస్తారని ఆడియన్స్ అనుకున్నారు .. కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యాడు.. కానీ రెమ్యూనరేషన్ విషయంలో తగ్గలేదు.. తాజా సమాచారం ప్రకారం శివాజీ ఒక్క వారానికి రూ. 4. 25 లక్షలు తీసుకున్నాడని తెలిసింది.. అతను మొత్తంగా కలిపి రూ. 63. 75 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నాడని సమాచారం. ఇది తెలుగు బిగ్ బాస్ చరిత్రలో హైయెస్ట్.. విన్నర్ కన్నా ఎక్కువగానే సంపాదించాడని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు..