బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ అంచానాల మధ్య, భారీ ఎత్తున డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కావాల్సి ఉంది. డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు బుకింగ్స్ కూడా స్టార్ట్ చేసి చివరి నిమిషంలో ఆర్థిక వివాదాల కారణంగా రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. మరికొన్ని గంటల్లో తెరమీద తమ హీరోను చూసేందుకు రెడీ అయిన ఫ్యాన్స్ కు రిలీజ్ వాయిదా వేయడం షాకింగ్ విషయం అనే చెప్పాలి.
అన్ని వివాదాలు, ఫైనాన్స్ క్లియరెన్స్ పనులు ముగించుకుని జనవరి 12 అనగా ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అయింది అఖండ 2. కాగా ఈ సినిమా టికెట్స్ ధరలు పెంచుకునేందుకు గతంలో ఏపీ జీవో అనుమతులు ఇచ్చింది. అయితే అది క్యాన్సిల్ అవడంతో తాజాగా మరోసారి టికెట్స్ హైక్ ఇస్తూ జీవో ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మొదటి పది రోజులు సింగిల్ స్క్రీన్స్ లో రూ. 75 మల్టిప్లెక్స్ లో రూ. 100 పెంచేలా ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. గురువారం రాత్రి 9 గంటల నుండి ప్రీమియర్స్ ప్రదర్శించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. మరికొన్ని గంటల్లో ఏపీ వ్యాప్తంగా బుకింగ్స్ ఓపెన్ చేయబోతున్నారు. ఇక నైజాంలో కూడా టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు తెలంగానా ప్రభుత్వం నుండి జీవో రావాల్సి ఉంది.