NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీలో ప్రజలకు గుడ్‌న్యూస్.. రైతు బజార్లలో తక్కువ ధరలకే సరుకులు

Ration

Ration

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు శుభవార్త చెప్పింది. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరకుల ధరలు పెరగడంతో.. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకే నిత్యావసరాలను అందజేస్తోంది. కందిపప్పు, బియ్యంను తక్కువ ధరలకు రైతు బజార్లలో అందించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా పౌరసరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్‌.. ఏపీలో బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు, బియ్యం ధరలు మండిపోతున్నాయని..వాటిని తగ్గించేందుకు నిర్ణయించారు.

Read Also: Srisailam Inflow: శ్రీశైలానికి తగ్గిన వరద.. 8 గేట్ల ద్వారా నీటి విడుదల

నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను మరో దఫా తగ్గించాలని నిర్ణయించామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రేపటి(గురువారం) నుంచి తగ్గించిన ధరలతో ఈ సరుకులు విక్రయిస్తారని తెలిపారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో రూ.160 ఉండగా.. రూ.150కీ విక్రయిచనున్నారు. బియ్యం రూ.48 నుంచి రూ.47కీ, స్టీమ్డ్ బియ్యం రూ.49 నుంచి రూ.48కీ తగ్గించిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి విక్రయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశించానని ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం- ఈ నెల రోజుల్లోపున బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.

Show comments