Site icon NTV Telugu

AP Assembly Sessions 2024: నేడు అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Ap Assembly Sessions

Ap Assembly Sessions

AP Assembly Sessions 2024: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం 9 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు అసెంబ్లీలో మూడు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఏపీ పంచాయితీ రాజ్ బిల్లు – 2024 ను అసెంబ్లీలో డిప్యూటి సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రవేశ పెట్టనున్నారు. ఏపీ మున్సిప‌ల్ బిల్లు- 2024 ను మంత్రి నారాయ‌ణ‌ అసెంబ్లీలో ప్రవేశ‌పెట్టనున్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను అసెంబ్లీలో మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ ప్రవేశ‌పెట్టనున్నారు. నేడు ఉదయం 9 గంటలకు క్వచ్చన్ అవర్‌తో అసెంబ్లీ ప్రారంభం కానుంది.

Read Also: Peddapalli: పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు..

ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. చింత‌ల‌పూడి ఎత్తిపోత‌ల ప‌థ‌కం, వీధికుక్కల బెడ‌ద.. గ్రామ‌,వార్డు మహిళా సంర‌క్షణ కార్యద‌ర్శులు, విశాఖ‌లో మెట్రోరైల్ నిర్మాణం, ఇరిగేష‌న్ కాలువ‌ల ఆధునీక‌ర‌ణ‌, రాష్ట్రంలో జాతీయ విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖ‌ల్లో ఉన్న ఖాళీల భ‌ర్తీ, గిరిజ‌న ప్రాంతాల్లో మౌలిక స‌దుపాయ‌ల క‌ల్పన‌, డీఎస్సీ-1998 అంశాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ప్రశ్నోత్తరాల అనంత‌రం 2024 -25 ఆర్థిక బ‌డ్జెట్‌పై చ‌ర్చించనున్నారు.

ఉద‌యం 10 గంట‌ల‌కు శాస‌న మండ‌లి ప్రారంభం కానుంది. ఉదయం 10 గంట‌ల‌కు శాస‌న‌మండ‌లిలో ప్రశ్నోత్తరాలు ప్రారంభం కానున్నాయి. ఫ్రీ హోల్డ్ భూములు క్రమ‌బద్దీక‌ర‌ణ‌, కైక‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో ర‌హ‌దారుల మ‌ర‌మ్మతులు, 2019 – 24 వ‌ర‌కు మద్యం అమ్మకాల‌లో జ‌రిగిన అక్రమాలు, గ్రామాల్లో డంపింగ్ యార్డులు, పంట రుణాల‌పై అధిక వ‌డ్డీ, విజ‌య‌న‌గ‌రంలో ఆతిసారం, పీడీఎస్ బియ్యం అక్రమాలు, ఉచిత‌పంట‌ల భీమా ప‌థ‌కం, పంచాయితీ భ‌వ‌నాలకు రంగులు, పాఠ‌శాల బ‌స్సులకు ప‌న్ను అంశాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. ప్రశ్నోత్తరాల అనంత‌రం 2024 – 25 ఆర్ధిక బ‌డ్జెట్‌పై చ‌ర్చించనున్నారు.

Exit mobile version