NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం బంపరాఫర్‌.. గంజాయికి సంబంధించి సమాచారమిస్తే నగదు రివార్డు

Vangalapudi Anitha

Vangalapudi Anitha

Andhra Pradesh: ఏపీలో గంజాయి లేకుండా చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో గంజాయి కట్టడికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గంజాయికి సంబంధించి ఏపీ సర్కారు బంపరాఫర్ ఇచ్చింది. గంజాయికి సంబంధించి పోలీసులకు స‌మాచారం ఇచ్చిన వారికి న‌గ‌దు రివార్డు ఇస్తామ‌ని హోంమంత్రి వెల్లడించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు టోల్‌ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. వారం రోజుల్లో టోల్ ఫ్రీ నంబ‌ర్ ఇస్తామ‌ని.. ఆ నంబ‌ర్‌కు ఫోన్ చేసి గంజాయిపై సమాచారం ఇవ్వొచ్చని ఆమె పేర్కొన్నారు. గంజాయిపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయమని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నుంచి గంజాయి వ్యాపారం మీదే బతికేద్దాం అనుకునే వాళ్ళ ఆటలు సాగవన్నారు. ఏ పార్టీ నాయకుడు ప్రమేయం గుర్తించినా ఉపేక్షించేది లేదన్నారు.

Read Also: Payyavula Keshav: రాష్ట్రానికి మంత్రి అయినా జిల్లాకు కూలీగా పని చేస్తా..

విశాఖలో గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కు పాదం మోపుతామమని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఈరోజు రాత్రి 8 తర్వాత గుంపులుగా చేరి గంజాయి సేవించే వాళ్ళను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి కేసుల్లో విశాఖలోనే 1230 మంది జైల్లో ఉన్నారంటే ఇక్కడ పరిస్థితి అర్థం అవుతోందన్నారు. వైసీపీ నాయకులే గంజాయి వ్యాపారులు కావడంతో అక్రమ రవాణాపై దృష్టి పెట్టలేదని ఆమె విమర్శంచారు. కరివేపాకు పేరుతో డోర్ డెలివరీ చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. విశాఖలో గంజాయి స్మగ్లింగ్, డ్రగ్స్ సరఫరా జరుగుతుంటే గత ప్రభుత్వం కనీస సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల దగ్గర గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. గంజాయి కారణంగా క్రైమ్ రేట్ పెరిగిందని మంత్రి అనిత వెల్లడించారు.