NTV Telugu Site icon

AP Government: పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం.. కొత్త పరిశ్రమల కోసం సర్కార్‌ కసరత్తు..

Ap

Ap

AP Government: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.. రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు వచ్చేలా చూసేందుకు చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తోంది.. గత ప్రభుత్వంలో ఏపీ నుంచి వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్తలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.. ఏపీలో పారిశ్రామిక వాడల్లో పరిస్థితిని చక్కదిద్దేలా చర్యలు తీసుకునేందేకు రెడీ అవుతున్నారు.. గన్నవరం పరిధిలోని మల్లవల్లి, వీరపనేని గూడెం ఇండస్ట్రీయల్ పార్కుల్లో మౌళిక వసతుల కల్పనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.. ఇప్పటికే అశోక్ లేలాండ్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ. మల్లవల్లి పారిశ్రామికవాడలో త్వరలో కార్యకలాపాలు నిర్వహించనుందట అశోక్ లేలాండ్. గత ప్రభుత్వంలో వెళ్లిపోయి.. మళ్లీ ఏపీకి తిరిగి రానున్న తొలి సంస్థగా అశోక్ లేలాండ్ నిలవనుంది.

Read Also: Ex-servicemen Murder Case: మాజీ సైనికుడి హత్య కేసు.. వెలుగులోకి సంచలన అంశాలు..!

ఇక, అశోక్ లేలాండ్ సహా 10 కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారట యార్లగడ్డ. మల్లవల్లిలో త్వరలో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రముఖ ఆచి మసాలా సంస్థ కూడా సిద్ధం అవుతోందని చెబుతున్నారు.. మరోవైపు.. విస్తరణ దిశగా HCL కంపెనీ ఆలోచనలు చేస్తోందట.. విశాఖ, బందరు, తిరుపతి, అనంతపురం జిల్లాలతో పాటు సీఆర్డీఏ పరిధిలో కంపెనీలను తెచ్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది చంద్రబాబు సర్కార్.. విశాఖలో సాఫ్ట్ వేర్, అనంత, తిరుపతి కేంద్రంగా హార్డ్ వేర్, ఫుడ్ ప్రాసెసింగ్, బందరులో బీపీసీఎస్ కంపెనీల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.. సీఆర్డీఏలోకి వివిధ సంస్థలను తిరిగి రప్పించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..